నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్: ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ (అండమాన్‌లో టెస్ట్ డ్రైవ్)

జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ ఇండియా త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్న 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ కోసం కంపెనీ ఇటీవలే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మీడియా టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా ఈ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమానికి హాజరయ్యింది. మేము చేసిన ఈ టెస్ట్ డ్రైవ్‌లో కొత్త 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్‌ను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త సన్నీని టెస్ట్ డ్రైవ్ చేయటానికి మేము బెంగుళూరు నుంచి విమానంలో పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాం. అసలే సముద్రం చుట్టూ ఉండే దీవులు కావటంతో అక్కడి వాతావరణంతా మరికాసేపట్లో భీకర తుఫాను రాబోతుందేమో అన్నట్లుగా మారిపోయింది. మరోవైపు సూర్యుడు కూడా నల్లటి దట్టమైన మేఘాల చాటు దాక్కొని నక్కి నక్కి మమ్మల్నే చూస్తున్నాడు. టెస్ట్ డ్రైవ్‌కు ఆ రోజు వాతావరణం అంత అనుకూలంగా లేదు. దీంతో మేము హోటల్‌కు విశ్రాంతి తీసుకొని తర్వాతి రోజు టెస్ట్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాం.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

తర్వాతి స్లైడ్‌లలో 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్ గురించి తెలుసుకోండి.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

తెల్లవారింది.. మేము త్వరత్వరగా రెడీ అయి టెస్ట్ డ్రైవ్‌కు సిద్ధమయ్యాం. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో వంపులు తిరుగుతూ సాగిపోయే పోర్ట్ బ్లెయిర్ రోడ్లపై డ్రైవింగ్ అంటే మహా సరదాగా అనిపించింది. కానీ ఎంతైనా ఈ రోడ్లు ఇండియాలోనే కదా ఉన్నాయి. కాబట్టి ఈ రోడ్లపై సేఫ్టీ అనేది చాలా అవసరం. సేఫ్టీ విషయంలో నిస్సాన్ సన్నీలో ఎలాంటి కంప్లయింట్స్ లేవు. మెకానికల్‌గా కొత్త సన్నీలో ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో మాత్రం చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్‌లోని మార్పులను దగ్గరగా గమనిస్తే.. ఫ్రంట్ గ్రిల్ చుట్టూ ఏర్పాటు చేసిన పెద్ద క్రోమ్ లైన్స్ కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తాయి. నిస్సాన్ టియానా సెడాన్‌ను తలపించే హెడ్‌లైట్స్, క్రోమ్ గార్నిష్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ (టాప్-ఎండ్ వేరియంట్లో) వంటి మార్పులను ఫ్రంట్ డిజైన్‌లో చూడొచ్చు. టాప్-ఎండ్ ఎక్స్‌వి వేరియంట్లో టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిస్ సైడ్ వ్యూ మిర్రర్లను కూడా ఆఫర్ చేస్తున్నారు. మొత్తమ్మీద కొత్త సన్నీ ఎక్స్టీరియర్లలో క్రోమ్ గార్నిష్ ఎక్కువగా కనిపిస్తుంది.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

కొత్త 2014 నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ రియర్ ప్రొఫైల్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్, టాప్-ఎండ్ వేరియంట్లో ఆఫర్ చేయబడే రియర్ బూట్ డోర్ మౌంటెండ్ క్రోమ్ బార్ (లైసెన్స్ ప్లేట్‌కు ఎగువన) వంటి వాటిని చెప్పుకోవచ్చు. కారు సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను మార్చారు (ఇవి కూడా టాప్-ఎండ్ వేరియంట్లోనే లభిస్తాయి).

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

నిస్సాన్ తమ సన్నీని భారత్‌లో విడుదల చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇంతవరకు ఇందులో ఫేస్‌లిఫ్ట్ రాలేదు. ఇదే మొట్టమొదటి ఫేస్‌లిఫ్ట్. అయినప్పటికీ, ఇందులో ఆహా అనదగిన ఫీచర్లు మాత్రం లేవనే చెప్పాలి. తాజాగా కంపెనీ ప్రవేశపెట్టనున్న ఫేస్‌లిఫ్ట్‌లో చిన్నపాటి కాస్మోటిక్ మార్పులు చేర్పులు తప్ప బేసిక్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఈ డిజైన్ కాస్త బోరింగ్ గానే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ, మునుపటి వెర్షన్ సన్నీ కన్నా కొత్త 2014 సన్నీ డిజైన్ కాస్తంత మెరుగ్గానే అనిపిస్తుంది.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

కొత్త 2014 నిస్సాన్ సన్నీ క్యాబిన్‌లో కూడా మార్పులున్నాయి. ఇందులో ప్రధానంగా.. ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్‌ను అమర్చిన కొత్త స్టీరింగ్ వీల్, కొత్త ఫేస్‌లిఫ్ట్ మైక్రా నుంచి గ్రహించిన పియానో బ్లాక్ ఫినిష్‌తో తయారు చేయబడిన సెంటర్ కన్సోల్, టాప్-ఎండ్ వేరియంట్లో లభించే రివర్స్ పార్కింగ్ కెమెరా, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, రియర్ ఏసి వెంట్స్, రియర్ రీడింగ్ ల్యాంప్స్, లెథర్ సీట్స్ మొదలైన అనేక ఫీచర్లను గమనించవచ్చు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

మొత్తమ్మీద అండమాన్ దీవుల్లోని రోడ్లపై సన్నీలో సవారీ సౌకర్యంగానే అనిపించింది. విశాలమైన క్యాబిన్ (విశాలమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ మరియు షోల్డర్‌రూమ్), సురక్షితమైన బ్రేకింగ్, సాలిడ్ సస్పెన్షన్లతో ఈ కారులో డ్రైవింగ్ సౌకర్యంగా ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త సన్నీ సెడాన్‌లో ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిలను మరింత మెరుగుపరచారు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

సూర్యుడు తూర్పు నుంచి పడమర వైపుకు వాలుతుండటంతో, మేము ఆ రోజు టెస్ట్ డ్రైవ్ బ్రేక్ ఇచ్చి, తిరిగి హోటల్‌కు చేరుకున్నాం. ఆ రాత్రంతా బాగా కునుకు తీసిన తర్వాత రోజున చిదియా తపు అనే ప్రాంతానికి సన్నీలో బయలుదేరాము. దక్షిణ అండమాన్ ఐలాండ్‌లో ఉన్న ఈ ద్వీపంలో ఇదొక అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత సన్నీ సెడాన్‌లోని 490 లీటర్ల బూట్ స్పేస్ నుంచి మేము తెచ్చుకు సామాగ్రిని బయటకు తీసి, అందమైన దృశ్యాలను, కారు ఫొటోలను చిత్రీకరించడం ప్రారంభించాం.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

రిఫ్రెష్డ్ 2014 నిస్సాన్ సన్నీ సెడాన్ మొత్తంగా ఓ మంచి డ్రైవింగ్ అనుభూతిని మిగిల్చింది. బడ్జెట్ ధరలో విశాలమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన సెడాన్ కోరుకునే వారికి నిస్సాన్ సన్నీ ఎప్పుడూ ఫస్ట్ ఆప్షన్‌గా ఉంటుందనే చెప్పాలి. కంపెనీ చేర్చిన ఈ అదనపు మార్పులు చేర్పుల వలన పాత సన్నీతో పోల్చుకుంటే కొత్త 2014 సన్నీ మరింత స్టయిలిష్‌గా, ప్రీమియంగా అనిపిస్తుంది. అయితే, దీని ధర ఇదివరకటి సన్నీ కన్నా సుమారు 40-50 వేలు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

తర్వాతి స్లైడ్‌లలో కొత్త నిస్సాన్ సన్నీ వేరియంట్లను, వేరియంట్ల వారీ ఫీచర్లను పరిశీలించండి.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

సన్నీ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. అవి - ఎక్స్ఈ, ఎక్స్ఎల్ మరియు ఎక్స్‌వి. ఇందులో ఎక్స్ఈ, ఎక్స్ఎల్ వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి. కాగా.. ఎక్స్‌వి వేరియంట్ మాత్రం కేవలం డీజిల్ వేరియంట్లోనే లభిస్తుంది. ఎక్స్‌వి వేరియంట్ కోసం కంపెనీ యాక్ససరీ ప్యాక్‌లను కూడా ఆఫర్ చేస్తోంది. అవి - ప్రీమియం ప్యాక్ 1, ప్రీమియం ప్యాక్ 2.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

బేస్ (ఎక్స్ఈ) వేరియంట్లో బాడీ కలర్డ్ బంపర్స్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, డ్యూయెల్ ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ ఎకానమీ డిస్‌ప్లే, కప్ హోల్డర్స్, టిల్ట్ అడ్జస్టబల్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, డ్రైవర్ ఎయిర్‌బ్యాక్, ఏబిఎస్ మరియు బ్రేక్ అసిస్ట్ ఫీచర్లు లభిస్తాయి.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

మిడ్ (ఎక్స్ఎల్) వేరియంట్లో, బేస్ వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, బ్లాకెన్డ్ రిమ్స్ విత్ వీల్ కవర్స్, బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్, బ్లాక్ బి-పిల్లర్, రియర్ డిఫాగ్గర్, 2-డిన్ ఆడియో సిస్టమ్ (బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీతో) స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్, 4 స్పీకర్లు, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, రియర్ ఆర్మ్ రెస్ట్, గ్రే థీమ్డ్ ఇంటీరియర్స్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, క్లైమేట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, బూట్ ల్యాంప్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, సీట్ బెల్ట్ ఇండికేటర్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

పెట్రోల్ వెర్షన్‌లో ఎక్స్ఎల్ వేరియంట్ ఆటోమేటిక్ (సివిటి) గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. డీజిల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ లేదు.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

ఇకపోతే టాప్ (ఎక్స్‌వి) వేరియంట్ కేవలం డీజిల్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇందులో మిడ్ (ఎక్స్ఎల్) వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా.. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ర్, అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్ (ఇండికేటర్లతో), ఫ్రంట్ బంపర్ మరియు బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, 2-డిన్ ఆడియో సిస్టమ్ కోసం డిస్‌ప్లే యూనిట్, అవుట్‌సైడ్ టెంపరేచర్ డిస్‌ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, రియర్ వ్యూ కెమెరా, రియర్ ఏసి వెంట్స్, రియర్ రీడింగ్ ల్యాంప్స్, వైపర్స్ కోసం వేరియబల్ స్పీడ్ సెట్టింగ్ ఆప్షన్, ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్స్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

ఎక్స్‌వి వేరియంట్ కోసం కంపెనీ రెండు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. ఇందులో ప్రీమియం ప్యాక్ 1లో లెథర్ సీట్స్, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్, గేర్ లివర్ ఫీచర్లు లభిస్తాయి.

అలాగే ప్రీమియం ప్యాక్ 2లో సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి.

నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ - ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్

కొత్త సన్నీ విడుదల తేది, దీని ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఇది మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Most Read Articles

English summary
Nissan India will soon launch the facelifted 2014 Sunny. The facelifted Nissan Sunny remains mechanically unchanged but features an upgraded exterior and interior. Take a look.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X