టాటా టిగోర్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ; టిగోర్ డ్రైవ్ గురించి అనుభవజ్ఞుని మాటల్లో

టాటా మోటార్స్ ఈ మార్చి 29 న విడుదలకు సిద్దం చేసిన టిగోర్ సెడాన్‌ను మా బృందం టెస్ట్ డ్రైవ్ చేసింది. పనితీరుతో పాటు ప్రయోజనాలు, ప్రతి కూలతలు మరియు కొనవచ్చా... కొనకూడదా? అనే వాటికి సమాధానం నేటి కథనంలో

By Anil

సందర్భం వచ్చింది కాబట్టి తెలుసుకోవాల్సిన పదం "కాంపాక్ట్ సెడాన్" అంటే ఏమిటి ? హ్యాచ్‌బ్యాక్ కార్లుగా పరిచయం అయ్యి, తరువాత వెనుక వైపున కాస్త డిక్కీని తగిలించుకుని వచ్చే కార్లని కాంపాక్ట్ సెడాన్ అని అనవచ్చు (ఉదా: స్విఫ్ట్ - డిజైర్, టయోటా లివా - ఎటియోస్, హోండా బ్రియో - అమేజ్, వోక్స్‌వ్యాగన్ పోలో - అమియో)

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో అమ్మకాల్లో సునామీ సృష్టించిన టియాగో హ్యాచ్‌బ్యాక్‌కు కొనసాగింపుగా టియాగో ఆధారిత కాంపాక్ట్ సెడాన్‌ టిగోర్‌ను టాటా మోటార్స్ పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి వచ్చే మార్చి 29 న విడుదలకు సిద్దం చేసింది.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

టిగోర్ రియర్ డిజైన్ ఆధారంగా కాంపాక్ట్ సెడాన్ వర్గంలోకి నెట్టేసినప్పటికీ టాటా మోటార్స్ దీనిని స్టైల్ బ్యాక్ కాంపాక్ట్ సెడాన్‌గా అభివర్ణిస్తోంది. గత వారంలో ఢిల్లీలో టాటా తమ టిగోర్‌కు మీడియా ప్రతినిధులచే ఫస్ట్ డ్రైవ్ నిర్వహించింది. టిగోర్ ఫస్ట్ డ్రైవ్ వివరాల ద్వారా ఇది ఎంత వరకు ఉత్తమమో చూద్దాం రండి...

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

కారు టెస్ట్ డ్రైవ్ వివరాల్లోకి వెళ్లే ముందు, డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లు మరియు ఇంజన్ వివరాలను తెలుసుకోవాలి.

డిజైన్ విషయానికి వస్తే, టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క ఫ్రంట్ డిజైన్ అచ్చంగా దింపేశారు. అయితే రియర్ డిజైన్ ఎవరూ ఊహించిన రీతిలో అందించారు. ఫ్రంట్ డిజైన్‌లో నల్లటి పొగ చూరిన హెడ్ ల్యాంప్స్ మరియు వీటిని అనుసంధానం చేసే పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ కలదు.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

టాటా టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్‌ను ప్రక్క వైపు నుండి గమనించండి. చూడగానే కూపే తరహా రూఫ్ టాప్‌ను కలిగి ఉన్న రూపాన్ని గమనించవచ్చు. వెనుక వైపున ఎత్తైన డిక్కీని గమనించవచ్చు. సరికొత్త 15-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స్ మీద ఇది పరుగులు పెట్టనుంది.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

వెనుక వైపు డిజైన్ పరిశీలిస్తే, ఇలాంటి రూపాన్ని ఇండియన్ మార్కెట్లో చాలా అరుదుగా చూస్తుంటాం. ముందు వైపున హెడ్ ల్యాంప్స్ వద్ద ప్రారంభమయ్యే క్యారెక్టర్ లైన్స్ వెనుక వైపు డిక్కీ అంచు వరకు పొడగించబడి ఉండి డిక్కీ మీద నిర్మించిన స్పాయిలర్‌తో ముగుస్తుంది, మరియు వెనుక వైపు అద్దం యొక్క పై అంచున మరో స్పాయిలర్ గమనించవచ్చు. డ్యూయల్ స్పాయిలర్ గల ఏకైక కాంపాక్ట్ సెడాన్ "టిగోర్".

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

డిక్కీలో వీలైనంత వరకు గరిష్ట స్పేస్‌ను కల్పించేందుకు ఎక్కువ దృష్టి పెట్టారు. ఎక్ట్సీరియర్ మీద నూతన డిజైన్ కల్పిస్తూనే, 419 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం అందివ్వడం జరిగింది. సులభంగా మరయు వేగంగా యాక్సెస్ చేయడానికి అధునాతన ఒపెన్ మరియు క్లోజింగ్ మెకానిజమ్ అందివ్వడం జరిగింది.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

ఎక్ట్సీరియర్ స్టైల్‌కు అనుగుణంగా ఇంటీరియర్‌కు ఏ మాత్రం తక్కువ చేయలేదు. విశాలమైన ఇంటీరియర్ క్యాబిన్ టియాగో హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌ను పోలి ఉన్నప్పటికీ ప్రీమియమ్ ఫీలింగ్‌నిచ్చే బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్లు, అప్‌హోల్‌స్ట్రే అందించారు.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

ప్రతి ఇండియన్ సౌకర్యవంతంగా కూర్చునే విధంగా సీటింగ్, లెగ్ మరియు హెడ్ రూమ్ కల్పించారు. వెనుక వరుసలో ఇద్దరు లేదా ముగ్గురు కూర్చునే సౌకర్యం కలదు. ముందు వరుస సీటింగ్‌లో అద్బుతమైన విజిబులిటిని కల్పించే డ్రైవర్ సీట్ అరేంజ్‌మెంట్ మరియు అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ కలదు.

కనెక్టివిటి ఫీచర్లు

కనెక్టివిటి ఫీచర్లు

ప్రస్తుతం విపణిలో అత్యుత్తమమైన 8-స్పీకర్ల అనుసంధానం గల ఇన్పోటైన్‌మెంట్ ఆడియో సిస్టమ్ కలదు. ఇందులో 5-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

టిగోర్ లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లోని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది వీడియోలను ప్లే చేస్తుంది, వాయిస్ కమాండ్స్ అదే విధంగా ఎస్‌ఎమ్ఎస్ లను బయటకు చదువుతుంది. అంతే కాకుండా ఇది రియర్ కెమెరా వ్యూవ్‌గా కూడా పనిచేస్తుంది. టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, నవీ మరియు జూకీ యాప్స్ ద్వారా మ్యూజిక్ షేరింగ్ వంటి వాటిని సపోర్ట్ చేస్తుంది.

భద్రత ఫీచర్లు

భద్రత ఫీచర్లు

ఫ్రంట్, రియర్ డిజైన్, ఇంటీరియర్ ఫీచర్లతో పాటు టాటా మోటార్స్ తమ టిగోర్ సెడాన్ యొక్క భద్రత మీద కూడా దృష్టిసారించింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా, ఎనర్జీని గ్రహించే బాడీ స్ట్రక్చర్ వంటివి కలవు.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

ప్రధాన సేఫ్టీ ఫీచర్లయిన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నరింగ్ స్టెబిలిటి కంట్రోల్(CSC) లతో పాటు టాటా మోటార్స్ ఈ టిగోర్‌లో "టాటా ఎమర్జెన్సీ అసిస్ట్ యాప్" అందించింది. దీని ద్వారా కారు ఎక్కడైనా ప్రమాదానికి గురైనప్పుడు, ఆ ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించవచ్చు.

పనితీరు...

పనితీరు...

రివ్యూలో ప్రధానమైన అంశం పనితీరు, టాటా తమ టిగోర్ స్టైల్ బ్యాక్ సెడాన్ కారులో టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో ఉన్న అవే శక్తివంతమైన పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను అందించింది.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

టిగోర్‌లోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడమైంది.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

అదే విధంగా టిగోర్ లోని మరో ఇంధన వేరియంట్ డీజల్ వెర్షన్‌లో 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల మూడు సిలిండర్ల 1.05-లీటర్ల సామర్థ్యం గల ఇంజన్ కలదు, దీనికి కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

పెట్రోల్ టిగోర్ డ్రైవింగ్ అనుభవం...

పెట్రోల్ టిగోర్ డ్రైవింగ్ అనుభవం...

పెట్రోల్ ఇంజన్ గల టిగోర్‌తో సిటి మరియు హై వే ల మీద సునాయాస ప్రయాణం సాధ్యమైంది. సంధర్బాన్ని బట్టి అవసరమైన పవర్‌ను అందివ్వడంలో పెట్రోల్ వేరియంట్ సఫలం చెందింది.

డీజల్ టిగోర్ వేరియంట్ డ్రైవింగ్ అనుభవం...

డీజల్ టిగోర్ వేరియంట్ డ్రైవింగ్ అనుభవం...

1.05-లీటర్ డీజల్ టిగోర్ వేరియంట్ డ్రైవ్ చాలా స్మూత్‌గా ఉంటుంది, అయితే ఇంజన్ వేగం 1,800 ఆర్‌పిఎమ్ నుండి 3,000 ఆర్‌పిఎమ్ మధ్య ఉన్నప్పుడు మరో వెహికల్‌ను ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఓ గేర్ తగ్గించాల్సిన అవసరం ఖచ్చితంగా కలుగుతుంది.

రైడింగ్ క్వాలిటీ

రైడింగ్ క్వాలిటీ

పెట్రోల్ మరియు డీజల్ ఏ వేరియంట్‌ అయనా రైడింగ్ క్వాలిటీ అద్బుతంగా ఉంది. కఠినమైన ఇండియన్ రోడ్లకు దీని మీద రైడింగ్ చక్కగా ఇమిడిపోతుంది. బాడీ రోలింగ్ దాదాపు తక్కువగా ఉంది, అయితే మలుపుల్లో వేగంగా నడిపినపుడు చక్రాలు కాస్త ట్రాక్ మీద జరిగినట్లుగా ఉంటాయి.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

డిజైన్ పరంగా టాటా టిగోర్ కారు ఇండియన్ కాంపాక్ట్ సెగ్మెంట్లో ఓ గేమ్ చేంజింగ్ డిజైన్ కలిగి ఉంది. ఇంజన్ వేరింయట్ల పరంగా చక్కగా ప్లాన్ చేసింది టాటా. పెట్రోల్ వేరియంట్ టిగోర్ విక్రయాల్లో రాజబాట పట్టే అవకాశం ఉంది. డీజల్ వేరియంట్ ప్రేమికులను టిగోర్ డీజల్ ఏ మాత్రం నిరాశపరచదు.

తెలుగులో టాటా టిగోర్ రివ్యూ

టాటా మోటార్స్ టిగోర్ ధరను వ్యూహాత్మకంగా నిర్ణయిస్తే, ప్రస్తుతం కాంపాక్ట్ సెగ్మెంట్లో లీడర్‌గా రాణిస్తున్న మారుతి సుజుకి డిజైర్ మరియు హ్యుందాయ్ ఎక్సెంట్‌ లకు చుక్కెదురు కావడం ఖాయం.

Most Read Articles

English summary
Tata Tigor First Drive Review: Read now our expert first drive review on Tata Tigor in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X