టాటా జెస్ట్ డీజిల్ ఏఎమ్‌టి టెస్ట్ డ్రైవ్ రివ్యూ; మేడ్ ఇన్ ఇండియా బ్యూటీ

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ సరికొత్త జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. బోరింగ్ డిజైన్స్‌కు చెక్ పెడుతూ.. అధునాత డిజైన్ మరియు ఫీచర్లతో అభివృద్ధి చేసిన టాటా జెస్ట్ కారును మా డ్రైవ్‌స్పార్క్ బృందం తాగా టెస్ట్ చేసింది. విభిన్న రోడ్లు, వాతావరణాల్లో ఈ కారును టెస్ట్ చేసి, దీని సామర్థ్యాన్ని, పనితీరును పరీక్షించడం జరిగింది.

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇంజనీర్ల సహకారంతో ఈ కారును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దారు. పూనే, కోవెంట్రీ (యూకే), టురిన్ (ఇటలీ)లలో ఉన్న టాటా మోటార్స్ డిజైన్ స్టూడియోల నుంచి సేకరించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కారును డిజైన్ చేశారు. టాటా జెస్ట్ నాణ్యత విషయంలో కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.

అంతేకాకుండా.. టాటా మోటార్స్ డీజిల్ వెర్షన్ టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని ఆఫర్ చేయటం నిజంగానే అత్యంత ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం, దేశంలో అత్యంత సరసమైన ధరకే లభిస్తున్న డీజిల్ ఆటోమేటిక్ (ఏఎమ్‌టి) కారు కూడా టాటా జెస్ట్ కావటం మరో విశేషం. టాటా మోటార్స్ మాకు టెస్ట్ డ్రైవ్ కోసం ఇదే ఏఎమ్‌‍టి డీజిల్ వెర్షన్ జెస్ట్ కారును ఆఫర్ చేసింది. మరి మా టెస్టింగ్‌లో టాటా జెస్ట్ ఎన్ని మార్కులు సంపాధించుకుందో తెలుసుకుందాం రండి..!

టాటా జెస్ట్ డిజైన్, పెర్ఫార్మెన్స్, ధర, మైలేజ్, హ్యాండ్లింగ్, స్పెసిఫికేషన్స్ మొదైలన వివరాలను తెలుసుకునేందుకు ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టాటా జెస్ట్ డీజిల్ ఏఎమ్‌టి టెస్ట్ డ్రైవ్ రివ్యూ

తర్వాతి స్లైడ్‌లలో టాటా జెస్ట్ ఏఎమ్‌టి డీజిల్ వెర్షన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూని పరిశీలించండి.

డిజైన్ - ఫ్రంట్

డిజైన్ - ఫ్రంట్

ఇదివరకు చెప్పుకున్నట్లు గానే టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇదివరకటి టాటా కార్లు ఇప్పటి టాటా జెస్ట్ కారు డిజైన్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. జెస్ట్ ద్వారా టాటా మోటార్స్ ఎట్టకేలకు అత్యాధునిక డిజైన్‌తో కూడిన కార్లను ఆఫర్ చేయటం ప్రారంభించినట్లు అనిపిస్తుంది. హనీ కోంబ్ గ్రిల్, క్రోమ్ గార్నిష్, సరికొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, విశిష్టమైన బంపర్ డిజైన్, పెద్ద ఎయిర్ ఇన్-టేక్ డ్యామ్‌తో ఇది ముందు వైపు నుంచి ఆకర్షనీయమైన లుక్‌ని కలిగి ఉంటుంది.

డిజైన్ - సైడ్

డిజైన్ - సైడ్

సైడ్ నుంచి చూసినట్లయితే, టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ డోర్ హ్యాండిల్స్‌ను కలుపుతూ పోయే బాడీ లైన్, డోర్స్ క్రింది భాగంలో రెండు డోర్లను కలుపుతూ పోయే మరో బాడీ లైన్ కనిపిస్తుంది. ఇవి కారుకు మంచి ఏరోడైనమిక్ లుక్‌నిస్తాయి. ఈ కారు 1570 మి.మీ. ఎత్తును కలిగి ఉండి, ఈ సెగ్మెంట్లో కెల్లా ఎత్తైన కారుగా నిలుస్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ ఇండియన్ రోడ్స్‌కి అనుకూలంగా ఉంటుంది.

అలాగే బ్లాక్ కలర్‌లో ఉండే బి-పిల్లర్స్, 15-ఇంచ్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇందులో మరో ప్రత్యేకత. ఇకపోతే బాడీ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రియర్ వ్యూ మిర్రర్, వాటిపై ఉండే బ్లింకర్స్‌ను కూడా ఇందులో గమనించవచ్చు.

డిజైన్ - రియర్

డిజైన్ - రియర్

టాటా జెస్ట్ ఓ కాంపాక్ట్ సెడాన్ కావటంతో, దీని బూట్ స్పేస్ కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. అయితే, ఇతర కాంపాక్ట్ సెడాన్ల మాదిరిగా దీని రియర్ డిజైన్ మాత్రం బ్యాలెన్స్డ్‌గానే అనిపిస్తుంది. స్ప్లిట్ టెయిల్ ల్యాంప్ (సగం బూట్ డోరుపై, సగం బాడీపై ఉండే ల్యాంప్స్), నెంబర్ ప్లేట్‌కు పైభాగంలో ఉండే క్రోమ్ స్ట్రైప్‌లు, ప్లాస్టిక్ అండర్ బాడీలను ఇందులో గమనించవచ్చు. జెస్ట్ రియర్ చాలా సింపుల్‌గా, నీట్‌గా ఉంటుంది.

మొత్తమ్మీద చూసుకుంటే టాటా జెస్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. ఇతర టాటా కార్లకు, దీనికి పోలిక కనిపించదు.

ఇంజన్

ఇంజన్

టాటా జెస్ట్ డీజిల్ కారులో అత్యంత పాపులర్ అయిన ఫియట్ 1.3 లీటర్ (1248సీసీ), 4-సిలిండర్, క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 89 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పలేం కానీ, యావరేజ్ కన్నా బెటరే అని మాత్రం చెప్పొచ్చు.

ఈ ఇంజన్ ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచే విషయంలో టాటా మోటార్స్ ప్రత్యేక జాగ్రత్త తీసుకుందని చెప్పాలి. ఇతర డీజిల్ కార్ల మాదిరిగా కాకుండా జెస్ట్ క్యాబిన్ లోపల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)

టాటా జెస్ట్ డీజిల్ వెర్షన్‌లో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)ని ఉపయోగించారు. ఈ గేర్‌బాక్స్‌ను ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ అనే సంస్థ సప్లయ్ చేస్తోంది. మారుతి సుజుకి ఆఫర్ చేస్తున్న కార్లలోని ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లను కూడా ఇదే కంపెనీ సప్లయ్ చేస్తోంది. టాటా మోటార్స్ తమ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ను ఎక్స్ఎమ్ఏ ఎఫ్-ట్రానిక్ (XMA F-Tronic) అని పిలుస్తోంది.

వాస్తవానికి ఏఎమ్‌టి అనేది సాంప్రదాయ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ మాదిరిగానే పనిచేస్తుంది. అయితే, ఇందులో క్లచ్ పెడల్ ఉండదు, దీనిని ఆన్-బోర్డ్ కంప్యూటర్ కంట్రోల్ చేస్తుంటుంది. విదేశాల్లో ఉపయోగించే ఏఎమ్‌టి యూనిట్లు డ్యూయెల్ క్లచ్ మెకానిజం‌ను కలిగి ఉండి, స్మూత్ గేర్ షిఫ్ట్‌ను ఆఫర్ చేస్తాయి. కానీ జెస్ట్‌లో మాత్రం సింగిల్ క్లచ్ మాత్రమే ఉంటుంది, ఫలితంగా ఆటో మోడ్‌లో తక్కువ స్పీడ్స్ వద్ద లేదా స్లోప్స్‌పై నడుపుతున్నప్పుడు కొద్దిపాటి జర్క్ ఫీల్ కలుగుతుంది. కానీ, మ్యాన్యువల్‌గా గేర్లను మార్చుకుంటే ఈ ఫీల్ కలగదు.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

టాటా జెస్ట్‌లో 5-స్పీడ్ ఏఎమ్‌టిని ఉపయోగించారు, ఈ గేర్‌‌బాక్స్‌ను ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్‌కు అనుగుణంగా ట్యూన్ చేశారు. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, అవి - ఆటో, స్పోర్ట్ మరియు టిప్‌ట్రానిక్ (మ్యాన్యువల్). నెమ్మదిగా కదులుతున్న ట్రాఫిక్‌లో జెస్ట్‌ను నడపాల్సి వచ్చినప్పుడు ఆటో మోడ్ సెలక్ట్ చేసుకోవటం మంచిది, దీని వలన మైలేజ్ పెరుగుతుంది. అయితే, వేగంగా కదులుతున్న ట్రాఫిక్‌లో లేదా ఓపెన్ హైవేలపై నడపాల్సి వచ్చినప్పుడు స్పోర్ట్ మోడ్ (గేర్‌బాక్స్‌పై ఉండే ఎస్ అనే బటన్‌ను నొక్కగానే ఈ మోడ్ ఎంగేజ్ అవుతుంది) ఎంచుకోవటం మంచిది. ఈ మోడ్‌లో గేర్స్ కొంత సమయం పాటు హోల్డ్‌లో ఉంటాయి (త్వరత్వరగా మారవు).

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఆటో, స్పోర్ట్స్ మోడ్స్ కాకుండా ఈ కారును టిప్‌ట్రానిక్ మోడ్‌లో కూడా డ్రైవ్ చేయవచ్చు. టిప్‌ట్రానిక్ అంటే సింపుల్‌గా మ్యాన్యువల్ మోడ్ అని అర్థం. ఈ మోడ్‌లో మీరు నడిపే వేగాన్ని బట్టి మీరే మ్యాన్యువల్‌గా గేర్ మార్చుకోవచ్చు. గేర్‌బాక్స్‌పై ఉండే ‘+' మరియు ‘-' గుర్తుల వైపు గేర్ లివర్‌ను కదిలించడం వలన గేర్లను పెంచుకోవటం, తగ్గించుకోవటం చేయవచ్చు. మనం ఏ గేరులో లేదా ఏ మోడ్‌లో కారును నడుపుతున్నామో అనే విషయాన్ని స్టీరింగ్ వెనుక ఉండే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై చూడొచ్చు. కొత్తగా ఏఎమ్‌టిని ఉపయోగించే వారికి పర్‌ఫెక్ట్ గేర్ షిఫ్ట్ పొందటం మొదట్లో కొంచెం ఇబ్బంది గానే అనిపిస్తుంది, అయితే దీనికి అలవాటు పడితే మాత్రం ఏఎమ్‌టి కారును నడపటం చాలా సులువుగా ఉంటుంది.

డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్

డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్

డ్రైవ్ అండ్ హ్యాండ్లింగ్ విషయంలో పర్‌ఫెక్ట్ బ్యాలెన్స్‌ని కల్పించేందుకు ఇందులోని సస్పెన్షన్ సిస్టమ్‌ను ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్‌కి అనుగుణంగా ట్యూన్ చేశారు. అయితే, ఘాట్స్, కార్నర్స్ వద్ద దీని పనితీరు మాత్రం అంత మాత్రంగానే ఉంటుంది. కానీ, పాట్‌హోల్స్, బంప్స్ వంటి రోడ్లపై మాత్రం దీని సస్పెన్షన్ సిస్టమ్ చక్కటి పనితీరును చూపిస్తుంది.

డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్

డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్

ఇండిపెండెంట్, కాయిల్ స్ప్రింగ్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు ట్విస్ట్ బీమ్, కాయిల్ స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్ సిస్టమ్ వలన ఎంత చెత్తగా వేసిన స్పీడ్ బ్రేకర్ ఇంపాక్ట్ నైనా సరే ఇవి చక్కగా గ్రహించి, క్యాబిన్ లోపల ఉన్న ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన డ్రైవ్‌ను ఆఫర్ చేయగలవు. ఈ కారులోని బ్రేక్స్ కూడా చక్కటి పనితీరును కనబరచాయి.

క్యాబిన్ - ఇంటీరియర్స్

క్యాబిన్ - ఇంటీరియర్స్

టాటా జెస్ట్ ఎక్స్టీరియర్స్ కన్నా కూడా ఇంటీరియర్సే చూపరులను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. ఇదివరకెన్నడూ టాటా కార్లలో చూడని విధంగా దీని ఎక్స్టీరియర్స్‌ను డిజైన్ చేశారు. బీజ్ అండ్ గ్రే కలర్లో ఉండే ఈ ఎక్స్టీరియర్స్ చాలా నీట్‌గా, సింపుల్‌గా, ఆట్రాక్టివ్‌గా ఉంటాయి. కానీ, ఫిట్ అండ్ ఫినిషింగ్ ఇంకొంచెం మెరుగు పరచి ఉంటే బాగుంటుందనేది మా అభిప్రాయం. ఇంటీరియర్స్‌లో అక్కడక్కడా క్రోమ్ అండ్ సిల్వర్ గార్నిషింగ్, విశిష్టమైన డిజైన్‌తో కూడిన సెంటర్ ఏసి వెంట్స్, పర్‌ఫెక్ట్‌గా ప్లేస్ చేసిన కంట్రోల్ స్విచెస్ ఇందులో ప్రత్యేకంగా నిలుస్తాయి.

క్యాబిన్ - స్పేస్

క్యాబిన్ - స్పేస్

టాటా జెస్ట్ ఓ కాంపాక్ట్ సెడాన్ అయినప్పటికీ, స్పేస్ విషయంలో మాత్రం కంపెనీ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఎత్తు, పొడవు, లావు ఉన్న వారు సైతం వెనుక సీట్లలో సౌకర్యంగా కూర్చునేలా విశాలమైన హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌లతో దీని ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. ఈ కారులోని సీట్లు కూడా ప్రయాణీకులకు మంచి సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఫ్రంట్ అండ్ రియర్ సీట్లలో అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్ ఉంటాయి. కానీ డ్రైవర్ సీట్‌కు మాత్రం హైట్ అడ్జస్టబల్ సౌకర్యం లేదు, ఫలితంగా పొట్టిగా ఉండే డ్రైవర్లకు రోడ్ మార్జిన్స్ పూర్తిగా కనిపించకపోయే ప్రమాదం ఉంది. ఈ కారులో ఐదుగురు (డ్రైవరుతో కలిపి) హాయిగా ప్రయాణించవచ్చు.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో అత్యంత పాపులర్ అయిన హార్మన్ బ్రాండ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది ఎమ్‌పి3, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీని, ఎఫ్ఎమ్‌ని సపోర్ట్ చేస్తుంది. అయితే, సిడి ప్లేయర్ ఆప్షన్ మాత్రం ఇందులో లేదు. బ్లూటూత్ ద్వారా ఆడియో ప్లే చేసుకోవటమే కాకుండా టెలిఫోన్ కాల్స్‌ను కూడా ఆన్సర్ చేయవచ్చు. స్టీరింగ్ వీల్‌పై అమర్చిన కంట్రోల్ సాయంతో హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్‌తో పాటుగా ఆడియో సిస్టమ్ వాల్యూమ్‌ని పెంచుకోవటం, తగ్గించుకోవటం చేయవచ్చు.

సైలెంట్ క్యాబిన్

సైలెంట్ క్యాబిన్

ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద రన్ అవుతున్నప్పటికీ, క్యాబిన్ లోపల ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) లెవల్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా, డీజిల్ కార్లంటే క్యాబిన్ లోపల ఎక్కువగా శబ్ధం వస్తుంటుంది, కానీ జస్ట్ విషయంలో అలా కాదు. క్యాబిన్ లోపల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

లైట్స్

లైట్స్

ఈ కారులో ప్రొజెక్టర్ లేదా ఎల్ఈడి హెడ్‌లైట్స్ లేకపోయినప్పటికీ, ఇందులో ఉన్న పవర్‌ఫుల్ స్టాండర్డ్ లైట్స్ మాత్రం రాత్రివేళల్లో చక్కటి కాంతిని వెదజల్లుతాయి. రాత్రివేళల్లో డ్రైవింగ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో ఇవి చక్కగా సహకరిస్తాయి.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

టాటా జెస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను క్లీన్‌గా డిజైన్ చేశారు. ఇందులో రెండు పెద్ద అనలాగ్ మీటర్స్ (ఆర్‌పిఎమ్ మీటర్, స్పీడోమీటర్) మరియు వాటి మధ్యలో ఓ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లే ద్వారా మనం నడుపుతున్న డ్రైవింగ్ మోడ్, నడుపుతున్న గేర్, డోర్ అజర్ వార్నింగ్, ట్రిప్ మీటర్, మైలేజ్ మొదలైన అంశాలు తెలుసుకోవచ్చు. ఒ నిర్దిష్ట ట్రిప్‌లో వచ్చిన మైలేజ్‌ను కూడా ఈ డిస్‌ప్లే సాయంతో తెలుసుకోవచ్చు.

ఈజీ యాక్సిసబల్ కంట్రోల్స్

ఈజీ యాక్సిసబల్ కంట్రోల్స్

ఇదివరకు చెప్పుకున్నట్లుగానే.. టాటా జెస్ట్‌లోని స్విచెస్, కంట్రోల్ బటన్స్‌ను సరైన స్థలంలో, సులువుగా యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా అమర్చారు. డ్రైవర్ సైడ్ డోరుపై అమర్చిన అల్-పవర్ విండోస్ స్విచెస్, స్టీరింగ్ వీల్‌పై ఎడమవైపున అమర్చిన ఆడియో, టెలిఫోన్ కంట్రోల్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్ అన్నీ కూడా డ్రైవర్ సులువుగా యాక్సెస్ చేసుకోవటం వీలవుతుంది.

అండర్‌సీట్ స్టోరేజ్

అండర్‌సీట్ స్టోరేజ్

జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ క్రింది భాగంలో స్టోరేజ్ సదుపాయం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ట్రేలో వాటర్ బాటిళ్లు, డాక్యుమెంట్లు, ఇతర విలువైన వస్తువులను దాచుకోవచ్చు.

బూట్ స్పేస్

బూట్ స్పేస్

ఈ కారులో 390 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. వాస్తవానికి ఓ కాంపాక్ట్ సెడాన్‌కి ఈ బూట్ స్పేస్ ఎక్కువే అయినప్పటికీ, చిన్నగా ఉండే దీని ఎంట్రో డోర్ కారణంగా పెద్ద వస్తువులను బూట్ స్పేస్‌లో ఉంచడం సాధ్యం కాకపోవచ్చు. అంతేకాకుండా, ఇందులో స్పేర్ వీల్‌ను సరిగ్గా ప్లేస్ చేయని కారణంగా, సదరు స్పేర్ వీల్ బూట్ స్పేస్‌లో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించినట్లు అనిపిస్తుంది. దాదాపు రూ.8 లక్షలు విలువ చేసే కారు బూట్ డోర్‌కి లోపలి వైపు క్లాడింగ్ లేకపోవటం గమనార్హం.

హైట్ అడ్జస్ట్‌‌మెంట్ డ్రైవర్ సీట్ లేకపోవటం

హైట్ అడ్జస్ట్‌‌మెంట్ డ్రైవర్ సీట్ లేకపోవటం

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు గానే జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో డ్రైవర్ సీటుకి హైట్ అడ్జస్ట్‌మెంట్ సౌకర్యం లేదు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కారణంగా డ్రైవర్ సైడ్ డ్యాష్‌బోర్డ్ చాలా ఎత్తుగా అనిపిస్తుంది. కాబట్టి, కనీసం డ్రైవర్ సైడ్ అయినా హైట్ అడ్జస్టబల్ సీట్ ఇచ్చి ఉంటే బాగుండనేది మా అభిప్రాయం. అలాగే, ఫ్రంట్ సీట్ బెల్టులకు కూడా హైట్ అడ్జస్ట్ సౌకర్యం ఉంటే బాగుండేది.

చిన్న ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్

చిన్న ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్

జెస్ట్ కారులో అమర్చిన ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చిన్నదిగా ఉండి, వెనుక నుంచి వస్తున్న ట్రాఫిక్‌ను, పూర్తి రోడ్‌ను కవర్ చేయది. ప్రత్యేకించి సి-పిల్లర్‌‌కు ఇరువైపులా ఉండే ట్రాఫిక్ సరిగ్గా కనిపించదు. సైడ్ మిర్రర్స్ వ్యూయింగ్ యాంగిల్స్‌ని కూడా కొంచెం మెరుగు పరచి ఉంటే బాగుండేది.

స్పోర్ట్స్ మోడ్ బటన్

స్పోర్ట్స్ మోడ్ బటన్

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పోర్ట్స్ మోడ్‌ను ఎంచుకోవాలంటే, గేర్‌బాక్స్ పక్కన ఉండే బటన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. కానీ, ఇదే బటన్‌ను స్టీరింగ్ వీల్‌పై ఆఫర్ చేసి ఉంటే, ఆ ఫీల్ వేరేగా ఉండేది. గేర్‌బాక్స్‌పై ఉన్న ఈ బటన్ నాణ్యతను మరింత మెరుగుపరచి ఉంటే బాగుండేది.

విజిబిలిటీ సమస్య

విజిబిలిటీ సమస్య

టాటా జెస్ట్ ముందు వైపు మంచి విండ్‌స్క్రీన్ ఉన్నప్పటికీ, మందంగా ఉన్న ఏ-పిల్లర్స్ కారణంగా కార్నర్స్‌లో విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. కార్నర్ తీసుకునేటప్పుడు లేదా వాహనాన్ని టర్నింగ్ చేసేటప్పుడు ఏ పిల్లర్ నుంచి కొంచెం ముందు వాలి చూడాల్సి ఉంటుంది.

యుటిలిటీ స్పేస్ సమస్య

యుటిలిటీ స్పేస్ సమస్య

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌లో యుటిలిటీ స్పేస్‌ను సరిగ్గా ప్లాన్ చేయలేదనే చెప్పాలి. ప్రత్యేకించి డోర్స్‌లో యుటిలిటీ స్పేస్‌ని వేస్ట్ చేశారని చెప్పాలి, మ్యాప్ పాకెట్స్‌తో పాటుగా బాటిల్ హోల్డర్లు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

టాటా జెస్ట్ స్పెసిఫికేషన్లను ఈ పట్టికలో చూడొచ్చు.

చివరిమాట

చివరిమాట

టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే, వీటిలో టాటా జెస్ట్ మాత్రమే ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో లభ్యమవుతుంది. ఈ ఫీచర్ వలన ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టంగా నిలుస్తుంది. ఇప్పటికే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఏఎమ్‌టి పట్ల అవగాహన పెరగటం వలన కొనుగోలుదారులు రెగ్యులర్ ఆటోమేటిక్ కార్ల కన్నా ఏఎమ్‌టి కార్లకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏఎమ్‌టితో అందులోనూ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమవుతున్న టాటా జెస్ట్ ఈ సెగ్మెంట్లో బెస్ట్ కారుగా చెప్పొచ్చు. మరి ఈ సరికొత్త టాటా జెస్ట్ మీకు కూడా నచ్చిందా..?

Most Read Articles

English summary
Expert review of Tata Zest diesel automatic (XMA F-Tronic AMT). Read our in-depth review of Tata Zest diesel AMT here.
Story first published: Monday, October 27, 2014, 14:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X