భారత్‌లో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే టాప్ 10 డీజిల్ కార్స్

పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరల మధ్య వ్యత్యాసం క్రమంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, కొందరు కస్టమర్లు మాత్రం ఇప్పటికీ డీజిల్ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే డీజిల్ కార్ల ధరలు అధికంగా ఉంటాయి, అలాగే వీటి మెయింటినెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, తరచూ లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేసేవారు లేదా నెలకు సగటున 1500 కి.మీ. నుంచి 2000 కి.మీ. దూరం ప్రయాణించే వారికి పెట్రోల్ కార్ల కన్నా డీజిల్ కార్లే బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

డీజిల్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు ప్రధానంగా పరిగణలోకి అంశం ఒక్కటే, అదే 'మైలేజ్'. ఒకప్పటి డీజిల్ ఇంజన్లకి నేటి మోడ్రన్ డీజిల్ ఇంజన్లకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత తరం డీజిల్ ఇంజన్ ఎంతగానో అభివృద్ధి చెందాయి. ఇవి తక్కువ కాలుష్యాన్ని వెదజల్లడమే కాకుండా, ఎక్కువ మైలేజీని కుడా ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మోడ్రన్ డీజిల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు డీజిల్ కార్లు సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు.

అయితే, పెరిగిన పోటీతత్వ వాతావరణంలో కార్ల తయారీదారులు సరసమైన ధరలకే డీజిల్ కార్లను ఆఫర్ చేస్తున్నారు. ఈనాటి మన కథనంలో భారత మార్కెట్లో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కార్ల గురించి తెలుసుకుందాం రండి..!

టాప్ 10 డీజిల్ కార్స్ (మైలేజ్)

తర్వాతి స్లైడ్‌లలో భారత మార్కెట్లో లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కార్ల వివరాలను తెలుసుకోండి.

(గమనిక: ఇందులో పేర్కొన్న మైలేజ్ గణాంకాలు నిర్ధిష్ట డ్రైవింగ్ పరిస్థితులకు లోబడి ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన దాని ప్రకారం పరిగణలోకి తీసుకోబడ్డాయి. రియల్ వరల్డ్ మైలేజ్ గణంగాలు వీటి కన్నా కాస్తం తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు. పాఠకులు గమనించగలరు.)

10. నిస్సాన్ మైక్రా - 23.08 కెఎమ్‌పిఎల్

10. నిస్సాన్ మైక్రా - 23.08 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 10 స్థానంలో ఉన్నది నిస్సాన్ మైక్రా డీజిల్ కారు. నిస్సాన్ మైక్రాలో 1461సీసీ, 4-సిలిండర్, ఎస్ఓహెచ్‌సి 8-వాల్వ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 63 బిహెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 41 లీటర్లు, మైలేజ్ - 23.08 కెఎమ్‌పిఎల్.

9. మారుతి సుజుకి రిట్జ్ - 23.20 కెఎమ్‌పిఎల్

9. మారుతి సుజుకి రిట్జ్ - 23.20 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 9 స్థానంలో ఉన్నది మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ కారు. రిట్జ్‌‌లో 1248సీసీ, 4-సిలిండర్, డిడిఐఎస్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 74 బిహెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 43 లీటర్లు, మైలేజ్ - 23.20 కెఎమ్‌పిఎల్.

8. టొయోటా ఎతియోస్ లివా - 23.59 కెఎమ్‌పిఎల్

8. టొయోటా ఎతియోస్ లివా - 23.59 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 8 స్థానంలో ఉన్నది టొయోటా ఎతియోస్ లివా డీజిల్ కారు. టొయోటా ఎతియోస్ లివాలో 1364సీసీ, 4-సిలిండర్, 8-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి, డి-4డి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3800 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పిల శక్తిని, 1800 ఆర్‌పిఎమ్ వద్ద 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్లు, మైలేజ్ - 23.59 కెఎమ్‌పిఎల్.

7. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 - 24 కెఎమ్‌పిఎల్

7. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 - 24 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 7 స్థానంలో ఉన్నది హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 డీజిల్ కారు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10లో 1120సీసీ, 3-సిలిండర్, యూ2 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 70 బిహెచ్‌పిల శక్తిని, 1500 ఆర్‌పిఎమ్ వద్ద 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 43 లీటర్లు, మైలేజ్ - 24 కెఎమ్‌పిఎల్.

6. హ్యుందాయ్ ఎక్సెంట్ - 24.4 కెఎమ్‌పిఎల్

6. హ్యుందాయ్ ఎక్సెంట్ - 24.4 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 6 స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఎక్సెంట్ డీజిల్ కారు. హ్యుందాయ్ ఎక్సెంట్‌‌లో 1120సీసీ, 3-సిలిండర్, యూ2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 71 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 180 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 43 లీటర్లు, మైలేజ్ - 24.4 కెఎమ్‌పిఎల్.

5. ఫోర్డ్ ఫియస్టా - 25.01 కెఎమ్‌పిఎల్

5. ఫోర్డ్ ఫియస్టా - 25.01 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 5 స్థానంలో ఉన్నది ఫోర్డ్ ఫియస్టా డీజిల్ కారు. ఫోర్డ్ ఫియస్టాలో 1498సీసీ, 4-సిలిండర్ ఇన్‌లైన్, 8-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 89 బిహెచ్‌పిల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 204 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్లు, మైలేజ్ - 25.01 కెఎమ్‌పిఎల్.

4. షెవర్లే బీట్ - 25.44 కెఎమ్‌పిఎల్

4. షెవర్లే బీట్ - 25.44 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 4 స్థానంలో ఉన్నది షెవర్లే బీట్ డీజిల్ కారు. షెవర్లే బీట్‌‌లో 936సీసీ, 3-సిలిండర్ ఇన్‌లైన్, టిసిఐసి డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 58 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 150 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు, మైలేజ్ - 25.44 కెఎమ్‌పిఎల్.

3. హోండా అమేజ్ - 25.80 కెఎమ్‌పిఎల్

3. హోండా అమేజ్ - 25.80 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 3 స్థానంలో ఉన్నది హోండా అమేజ్ డీజిల్ కారు. హోండా అమేజ్‌లో 1498సీసీ, 4-సిలిండర్, డిఓహెచ్‌సి, ఐడిటెక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు, మైలేజ్ - 25.80 కెఎమ్‌పిఎల్.

2. హోండా సిటీ - 26 కెఎమ్‌పిఎల్

2. హోండా సిటీ - 26 కెఎమ్‌పిఎల్

ఈ జాబితాలో టాప్ 2 స్థానంలో ఉన్నది హోండా సిటీ డీజిల్ కారు. హోండా సిటీలో 1498సీసీ, 4-సిలిండర్, డిఓహెచ్‌సి, ఐడిటెక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పిల శక్తిని, 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్లు, మైలేజ్ - 26 కెఎమ్‌పిఎల్.

1. మారుతి సుజుకి సియాజ్ - 26.21 కెఎమ్‌పిఎల్

1. మారుతి సుజుకి సియాజ్ - 26.21 కెఎమ్‌పిఎల్

కాగా.. ఈ జాబితాలో ఆగ్రస్థానంలోకి రానుంది త్వరలో మార్కెట్లోకి విడుదల మారుతి సుజుకి సియాజ్. డీజిల్ వెర్షన్ మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌లో ఫియట్ నుంచి గ్రహించిన 1.3 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇది గరిష్టంగా 89 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 26.21 కెఎమ్‌పిఎల్.

Most Read Articles

English summary
We'll discuss about the top-10 most fuel efficient diesel cars in India. The basis on which we have short-listed these cars, is the ARAI mileage figures that these cars achieved during their test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X