సంభరంలో రెనో క్విడ్, భాదపడుతున్న మారుతి ఆల్టో

By Anil

భారతీయ ఆటోమొబైల్ విభాగంలో 2017 ఆర్థిక ఏడాది ప్రారంభంలో మొదటి నెల గడిచిపోయింది. ఈ ఆర్థిక ఏడాది ప్రారంభం దాదాపుగా అన్ని రకాల వాహన సంస్థలకు కూడా అశించిన స్థాయిలో ఫలితాలను ఇచ్చింది. అయితే ఈ అమ్మకాలలో టాప్-10 వాటిని పరిశీలిస్తే 10 కి ఆరు కార్లు ఎప్పటిలాగే ఈ జాబితాలో ఉన్నాయి. కాని రాను రాను మారుతి ఆల్టో దాని మొదటి స్థానం కోల్పోయే పరిస్థితి రానుంది. కారణం రెనో క్విడ్ విడుదలయిన అతి కొద్ది కాలంలోనే టాప్-10 జాబితాలో స్థానం దక్కించుకుంది. అయితే దీని వలన ఆల్టో మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రింది కథనంలో 2016 ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడు పోయిన టాప్-10 కార్ల జాబితా చూద్దాం రండి.

10. హోండా సిటి

10. హోండా సిటి

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఇప్పుడిప్పుడే దేశీయ వాహన పరిశ్రమలో ఓ స్థానం సంపాదించుకుంటోంది. హోండాకు చెందిన ఉత్తమ సెడాన్ సిటి ఈ జాబితాలో పదవ స్థానంలో చోటు సాధించింది. గడిచిన 2016 ఏప్రిల్ నెలలో సుమారుగా 5,793 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

09. మారుతి సుజుకి సెలెరియో

09. మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకికు చెందిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారు సుమారుగా 8,548 యూనిట్ల సెలెరియో కార్ల అమ్మకాలు జరిపి 61 శాతం వృద్దితో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

08. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

08. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

ఒకపుడు ఎలైట్ ఐ20 కారు హ్యుందాయ్ వారి బెస్ట్ సెల్లింగ్ కారు మరియు ఓ మారు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యింది. అయితే మారుతి వారి బాలెనొ కారు రాకతో ఎలైట్ ఐ20 అమ్మకాలు 24 శాతం తగ్గిపోయి, 9,400 యూనిట్లు అమ్ముడయ్యాయి.

07. మారుతి సుజుకి బాలెనొ

07. మారుతి సుజుకి బాలెనొ

ఈ టాప్-10 జాబితాలో మారుతి వారి రెండవ కారు బాలెనొ. గత ఏడాది ఇదే సమయానికి దీని పేరు కూడా ఎవ్వరికీ తెలియదు. కాని నేడు కొన్ని వందల ఉత్పత్తులను వెనక్కి నెట్టి టాప్-జాబితాలో 9,562 యూనిట్లు అమ్మకాలు జరిపి ఏడవ స్థానంలో నిలిచింది.

06. రెనో క్విడ్

06. రెనో క్విడ్

ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో గత ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ఆల్టోకు పోటీగా క్విడ్ కారును అందుబాటులోకి తీసుకువచ్చారు. విడుదల చేసిన అనతి కాలంలోనే భారీ అమ్మకాలను నమోదు చేసుకుంటోంది. ఎంతగా అంటే గత 30 లక్షల వరకు అమ్ముడు పోయిన అల్టో కూడా దీని ప్రభావానానికి బయపడుతోంది. గడిచిన 2016 ఏప్రిల్ నెలలో 9,795 యూనిట్ల క్విడ్ కార్లు అమ్ముడుపోయాయి.

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

05. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్‌కు ప్రతి ఏడాది కూడా ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధించి పెడుతోంది ఆ గ్రాండ్ ఐ10 కారు. గడిచిన ఏప్రిల్ నెలలో ఈ గ్రాండ్ ఐ10 కారును సుమారుగా 9,840 మంది భారతీయులు ఎంచుకున్నారు. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోల్చితే గ్రాండ్ ఐ10 12 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

04. మారుతి సుజుకి డిజైర్

04. మారుతి సుజుకి డిజైర్

2016 మార్చి నెల అమ్మకాలలో డిజైర్ సెడాన్ కారు రెండవ స్థానంలో ఉండగా, ఆ తరువాత నెల అయిన 2016 ఏప్రిల్ నెలలో 12,256 యూనిట్ల అమ్మకాలు సాధించి 20 శాతం వృద్దిని కోల్పోయి నాలుగవ స్థానానికి పరిమితం అయ్యింది.

03. మారుతి వ్యాగన్ ఆర్

03. మారుతి వ్యాగన్ ఆర్

ఇండియన్ మార్కెట్లో పొడవైన, ఎత్తైన ఆకారంలో మరియు విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను కలిగిన ఏకైక స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు ఈ వ్యాగన్ ఆర్. గత ఏప్రిల్ 2016 నెలలో ఇది సుమరుగా 15,323 యూనిట్ల వరకు అమ్మకాలు సాధించి 10 శాతం వృద్దని నమోదు చేసుకుంది.

02. మారుతి సుజుకి స్విఫ్ట్

02. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి వారి ఐదవ ఉత్పత్తి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎప్పటిలాగే ఈ జాబితాలో స్థానం సంపాదించింది. గడిచిన 2016 ఏప్రిల్ నెలలో స్విఫ్ట్ సుమారుగా 15,661 యూనిట్ల అమ్మకాలు సాధించి టాప్-10 అమ్మకాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

 01. మారుతి ఆల్టో

01. మారుతి ఆల్టో

మారుతి ఆల్టో ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలిచింది. ఇది గడిచిన ఏప్రిల్ నెలలో 16,583 యూనిట్ల అమ్మకాలు సాధించి. 23 శాతం వృద్దిని కోల్పోయింది. ఇలా 23 శాతం వృద్దిని కోల్పోవడానికి ముఖ్య కారణం రెనో క్విడ్ ఎంట్రీ అని స్పష్టం తెలుస్తోంది. అమ్మకాల పరంగా ఆల్టో వినియోగదారులను రెనో క్విడ్ భారీ స్థాయిలో ఆకర్షిస్తోంది.

2016 ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్ముడు పోయిన టాప్-10 కార్లు

సెకండ్ హ్యాండ్ కార్లను కొంటున్నారా ? అయితే వేటికి ఎక్కువ రీసేల్ వ్యాల్యూ ఉందో చూడండి

హ్యుందాయ్‌ను అధిగమించిన రెనో క్విడ్ తరువాత మారుతి వంతు

Most Read Articles

English summary
Top 10 Selling Cars In April 2016; A New Car Is Threatening The Top Seller
Story first published: Thursday, May 12, 2016, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X