టాప్-10 సెల్లింగ్ కార్లలో పెను మార్పులు: తారు మారైన కార్ల అమ్మకాలు

By Anil

ఈ ఏడాది ప్రారంభం నుండి ప్రతి నెల కార్ల అమ్మకాలను గమనిస్తే చాలా వరకు ఒకే విధమైన కార్లు టాప్-10 లిస్ట్‌లో స్థానం సంపాదిస్తూ వచ్చాయి. కాని గత జూన్ 2016 లో జరిగిన అమ్మకాలు మాత్రం మార్కెట్ వర్గాలను అమాంతం ఆశ్చర్యపరిచాయి. కొన్ని కొత్త కార్ల టాప్-10 జాబితాలో స్థానం సంపాదించగా మరికొన్ని ఈ జాబితా నుండి తప్పుకున్నాయి.

జూన్ 2016 లో అత్యధికంగా అమ్మకాలు సాధించి టాప్-10 జాబితాలో నిలిచిన కార్ల గురించి క్రింది కథనంలో....

10. మారుతి సుజుకి బాలెనొ

10. మారుతి సుజుకి బాలెనొ

ఇండియన్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి మారుతి సుజుకి గత ఏడాదిలో బాలెనొను అందించింది. మే 2016 వరకు ఉత్తమమైన అమ్మకాలను సాధించింది. కాని స్వల్ప మందగమనంతో 6,967 యూనిట్లు అమ్మకాలు జరిపి టాప్-10 జాబితాలో 10 వ స్థానంలో నిలిచింది.

బాలెనొ గురించి

బాలెనొ గురించి

మారుతి సుజుకి బాలెనొ లోని పెట్రోల్ మరియు డీజల్ ఎంట్రీలెవల్ వేరియంట్ల యొక్క హైదరాబాద్ ఆన్ రోడ్ ధరలు మరియు మైలేజ్ వివరాలు.బాలెనొ పెట్రోల్ ధర రూ. 6.28 లక్షలు

  • బాలెనొ డీజల్ ధర రూ. 7.67 లక్షలు
  • బాలెనొ పెట్రోల్ మైలేజ్: 21.4 కిమీ/లీ
  • బాలెనొ డీజల్ మైలేజ్: 27.39 కిమీ/లీ
  • 09. హ్యుందాయ్ క్రెటా

    09. హ్యుందాయ్ క్రెటా

    ఇండియన్ మార్కెట్లో ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల తర్వాత అత్యధిక అమ్మకాలు సాదిస్తున్న సెగ్మెంట్ ఎస్‍‌యువి. గత ఏడాదిలో కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ విడుదల చేసిన క్రెటా భారీ విజయం సాధించింది. కొన్ని నెలల విరామం తర్వాత తిరిగి టాప్-10 జాబితాలో చోటు సాధించింది. గడిచిన జూలై 2016 అమ్మకాల్లో 7,700 యూనిట్ల క్రెటా ఎస్‌యువిలు అమ్ముడుపోయాయి.

    హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువి గురించి

    హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువి గురించి

    హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ల యొక్క ఆన్ రోడ్ హైదరబాద్ ధరలు మరియు మైలేజ్ వివరాలు.

    • క్రెటా పెట్రోల్ ధర రూ. 10.81 లక్షలు
    • క్రెటా డీజల్ ధర రూ. 12.09 లక్షలు
    • క్రెటా పెట్రోల్ మైలేజ్: 15.29 కిమీ/లీ
    • క్రెటా డీజల్ మైలేజ్: 21.38 కిమీ/లీ
    • 08. టయోటా ఇన్నోవా క్రిస్టా

      08. టయోటా ఇన్నోవా క్రిస్టా

      టయోటా మోటార్స్ ఇండియన్ ఎమ్‌పివి సెగ్మెంట్లోకి తమ ఇన్నోవా స్థానంలోకి ప్రవేశపెట్టిన క్రిస్టా తిరుగులేని అమ్మకాలను సాధించింది. ఎంతగా అంటే చాలా కాలం తరువాత ఒక ఎమ్‌పివి వాహనం టాప్-10 జాబితాలోకి ప్రవేశించింది. విడుదల చేసిన అనతి కాలంలోనే ఇన్నోవా క్రిస్టా భారీ విజయాన్ని అందుకుంది. గడిచిన జూన్ 2016 మాసంలో 8,171 యూనిట్లు అమ్ముడుపోయి ఎనిమిదవ స్థానంలో నిలిచింది.

      టయోటా ఇన్నోవా క్రిస్టా గురించి

      టయోటా ఇన్నోవా క్రిస్టా గురించి

      టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి కేవలం డీజల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో కలదు, త్వరలో టయోటా దీనిని పెట్రోల్ వేరియంట్లో కూడా విడుదల చేయనుంది. టయోటా ఇన్నోలా క్రిస్టా డీజల్ ఎంట్రీలెవల్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 18.13 లక్షలుగా ఉంది మరియు ఇది లీటర్‌కు 15.1 కిమీ/లీ మైలేజ్ ఇవ్వగలదు.

      07. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

      07. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

      కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ మారుతి సుజుకితో భీకరమైన పోటికి గురవుతోందని చెప్పవచ్చు. మారుతి వారి బాలెనొ కారుతో ఇది తీవ్రమైన పోటీని ఎదుర్కుంటోంది. కాని గడిచిన 8,990 యూనిట్ల అమ్మకాలు జరిపి ఏడవ స్థానంలో నిలిచి బాలెనొను పదవ స్థానానికి నెట్టేసింది.

      హ్యుందాయ్ ఎలైట్ ఐ20 గురించి

      హ్యుందాయ్ ఎలైట్ ఐ20 గురించి

      హ్యుందాయ్ ఎలైట్ పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు మరియు మైలేజ్ వివరాలు.

      • ఎలైట్ ఐ20 పెట్రోల్ ధర రూ. 6.54 లక్షలు
      • ఎలైట్ ఐ20 డీజల్ ధర రూ. 7.97 లక్షలు
      • ఎలైట్ ఐ20 పెట్రోల్ మైలేజ్: 18.6 కిమీ/లీ
      • ఎలైట్ ఐ20 డీజల్ మైలేజ్: 22.54 కిమీ/లీ
      • 06. మారుతి సుజుకి స్విఫ్ట్

        06. మారుతి సుజుకి స్విఫ్ట్

        మారుతి సుజుకి వారి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలిందని ఇది ఆరవ స్థానంలో నిలిచిన ఘటనే స్పష్టంగా చెపుతోంది. ఎంతో కాలంగా మూడు మరియు నాలుగవ స్థానాలలో నిలిచే ఈ స్విఫ్ట పతనం దిశగా అడుగులేస్తూ 9,033 యూనిట్లు అమ్మకాలు జరిపి ఆరవ స్థానానికి పరిమితం అయ్యింది. కొత్త కార్ల హవా పెరగడం మరియు అవుట్ డేటెడ్ డిజైన్ వంటి అంశాలే ఈ ఫలితాలకు కారణం అని తెలుస్తోంది.

        మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి

        మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి

        మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోని పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు మరియు మైలేజ్ వివరాలు.

        • స్విఫ్ట్ పెట్రోల్ ధర రూ. 5.68 లక్షలు
        • స్విఫ్ట్ డీజల్ ధర రూ. 7.13 లక్షలు
        • స్విఫ్ట్ పెట్రోల్ మైలేజ్: 20.4 కిమీ/లీ
        • స్విఫ్ట్ డీజల్ మైలేజ్: 25.2 కిమీ/లీ
        • 05. రెనో క్విడ్

          05. రెనో క్విడ్

          ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియన్ మార్కెట్లోకి క్విడ్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. విడుదైనప్పటి నుండి సుమారుగా 1.5 లక్షలకు పైగా బుకింగ్స్‌ నమోదు చేసుకుని రికార్డు నెలకొల్పింది. జూన్ 2016 లో కూడా 9,459 యూనిట్ల అమ్మకాలు సాధించి ఐదవ స్థానంలో నిలిచింది.

          రెనో క్విడ్ గురించి

          రెనో క్విడ్ గురించి

          రెనో క్విడ్‌లో కేవలం 800సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ మాత్రమే కలదు. ఇది సుమారుగా లీటర్‌కు 20.4 కిలోమీటర్ల మైలేజ్‌ ఇవ్వగలదు మరియు ప్రారంభ వేరియంట్ క్విడ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 3.26 లక్షలుగా ఉంది.

           04. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

          04. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

          మారుతి సుజుకి వారి టాల్ బాయ్ డిజైన్ గల ఏకైక కారు వ్యాగన్ ఆర్. గత జూన్ 2016 లో 11,962 యూనిట్లు అమ్మకాలు జరిపి నాలుగవ స్థానంలో నిలవగా అంతుకు మునుపు మే 2016 లో 13,231 యూనిట్ల అమ్మకాలతో మూజవ స్థానంలో ఉండేది.

          మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ గురించి

          మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ గురించి

          మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ లోని పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్ల యొక్క ఎంట్రీ లెవల్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు మరియు వాటి మైలేజ్ వివరాలు.

          • వ్యాగన్ ఆర్ పెట్రోల్ ధర రూ. 4.92 లక్షలు
          • వ్యాగన్ ఆర్ సిఎన్‌జి ధర రూ. 5.58 లక్షలు
          • వ్యాగన ఆర్ పెట్రోల్ మైలేజ్: 20.5 కిమీ/లీ
          • వ్యాగన ఆర్ సిఎన్‌జి మైలేజ్: 20.5 కిమీ/లీ
          • 03. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

            03. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

            హ్యుందాయ్ వారి మూడవ ఉత్పత్తి గ్రాండ్ ఐ10 ఈ టాప్-10 జాబితాలో వ్యాగన్ ఆర్ తో తీవ్రమైన పోటీని ఎదుర్కొని చివరికి వ్యాగన్ ఆర్ ను నాలుగవ స్థానానికి పరిమితం చేసి ఇది మూడవ స్థానంలో నిలిచింది. మే 2016 లో 12,055 యూనిట్ల అమ్మకాలతో ఐదవ స్థానంలో ఉండగా, జూన్ 2016 లో 12,678 యూనిట్ల అమ్మకాలు జరిపి రెండు స్థానాలు ఎగబాకి మూడవ స్థానంలో నిలిచింది.

             హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 గురించి

            హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 గురించి

            హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 లోని పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు మరియు మైలేజ్ వివరాలు.

            • గ్రాండ్ ఐ10 పెట్రోల్ ధర రూ. 5.74 లక్షలు
            • గ్రాండ్ ఐ10 డీజల్ ధర రూ. 6.82 లక్షలు
            • గ్రాండ్ ఐ10 పెట్రోల్ మైలేజ్: 18.9 కిమీ/లీ
            • గ్రాండ్ ఐ10 డీజల్ మైలేజ్: 24 కిమీ/లీ
            • 02. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

              02. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్

              ఇండియన్ మార్కెట్లో ఉన్న ఎకైక బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్. స్విఫ్ట్ డిజైర్ గడిచిన జూలై 2016 మాసంలో 15,560 యూనిట్ల అమ్మకాలు జరిపి ఎప్పటిలాగే టాప్-10 సెల్లింగ్ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

              మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ గురించి

              మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ గురించి

              మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ లోని పెట్రోల్ మరియు డీజల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధరలు మరియు మైలేజ్ వివరాలు.

              • స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ ధర రూ. 6.08 లక్షలు
              • స్విఫ్ట్ డిజైర్ డీజల్ ధర రూ. 7.61 లక్షలు
              • స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ మైలేజ్: 20.85 కిమీ/లీ
              • స్విఫ్ట్ డిజైర్ డీజల్ మైలేజ్: 26.59 కిమీ/లీ
              • 01. మారుతి సుజుకి ఆల్టో800

                01. మారుతి సుజుకి ఆల్టో800

                భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారు ఆల్టో 800 ఎప్పటిలాగే గడిచిన నెలలో కూడా మొదటి స్థానంలోనే నిలిచింది. మే 2016 లో 19,874 యూనిట్ల అమ్మకాలు జరపగా గత జూన్ 2016 లో కేవలం 15,750 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కాని మొదటి స్థానంలో నిలిచింది. అమ్మకాల పరంగా పతన కావడానికి కారణం రెనో క్విడ్ అని స్పష్టంగా అర్థమవుతోంది.

                మారుతి ఆల్టో800 గురించి

                మారుతి ఆల్టో800 గురించి

                మారుతి సుజుకి ఆల్టో800 యొక్క పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 2.99 లక్షలుగా ఉంది మరియు ఇద లీటర్‌కు 24.7 కిలోమీటర్ల మైలే‌జ్‌ను ఇవ్వగలదు.

                టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్లు

                • ఇక్కడ విమానం దింపాలంటే ఆ ఎనిమిది మంది మాత్రమే అర్హులు
                • షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
Top Ten Best Selling Cars In India In June 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X