ఆసియాలోని అత్యంత పొడవైన డ్రైవ్ ఇన్ బీచ్‌లో టయోటా ఎటియోస్ క్రాస్ రివ్యూ

By Anil

ఆసియా దేశాలలో ఉన్న అన్ని బీచ్‌లలో కెల్లా ఈ బీచ్ ఎంతో ప్రత్యేకమైనది. అత్యంత పొడవైన డ్రైవ్ గల బీచ్‌ ఇది. సుమరుగా 5.5 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. అందుకే ఆసియా దేశాలలోని మరే ఇతర బీచ్‌లకు లేని ప్రాముఖ్యత దీనికి ఉంది.

ముజపిలంగాడ్ అనే ఈ బీచ్ కేరళలోని కన్నూర్ మరియు థలస్సెరి మధ్య కలదు. ఇక్కడ ప్రతిష్టాత్మకమైన బీచ్ డ్రైవ్ ర్యాలీలు ఎన్నో జరుగుతుంంటాయి. ఈ బీచ్ గురించి చెప్పాలంటే అత్యంత ఉత్తమమైన బీచ్‌ డ్రైవ్‌లలో ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆరవ స్థానంలో ఉంది.

టయోటా ఎటియోస్ క్రాస్-1

జపాన్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ టయోటా మోటార్స్‌కు చెందిన ఎటియోస్ క్రాస్ హ్యాచ్‌బ్యాక్‌ను డ్రైవ్‌స్పార్క్ బృందం డ్రైవ్‌ చేసి ఇందులోని లోటుపాట్లను అందివ్వడం జరిగింది. అంతే కాకుండా వారి అనుభవాలను, వారి సుదీర్ఘ ప్రయాణానికి దోహదమైన ముఖ్యమైన అంశాలను ఈ ప్రత్యేక టయోటా ఎటియోస్ క్రాస్ ట్రావెల్ రివ్యూ ద్వారా అందివ్వడం జరిగింది.

డ్రైవ్‌స్పార్క్ బృందం ఎటియోస్ క్రాస్‌తో సుందరమైన కొండలు మరియు అందమైన ప్రకృతి మధ్యన ఉన్న వయానంద్ మీదుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణంలో భాగంగానే అనేక అంశాలను గుర్తించారు.

టయోటా ఎటియోస్ క్రాస్-02

ఎటియోస్ క్రాస్ పనితీరును మరింత మెరుగుపరచడానికి దీనికి అద్బుతమైన డిజైన్ అందించారు. అందులో ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్‌ తరహాలో ఉంటూనే ఎస్‌యువి లక్షణాలను కలిగి ఉంది. తద్వారా ఇంటీరియర్ ఎంతో విశాలంగా ఉంది. ట్రాఫిక్ మరియు పార్కింగ్ అదే విధంగా లాంగ్ డ్రైవ్ సమయాలలో దీని టర్నింగ్ రేడియస్ ఎంతో బాగుంది. ఉత్తమ ట్రాక్షన్, గొప్ప గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలు దీనిని ఆన్ రోడర్ అనే కాకుండా ఆఫ్ రోడర్ అని కూడా తెలుపుతున్నాయి.

సాంకేతికంగా ఇందులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ పనితీరు అద్బుతం అని చెప్పవచ్చు. స్మూత్ రైడింగ్. సిటి రైడింగ్‌లో ఉత్తమ పనితీరు కనబరుస్తుంది. ఇది సుమారుగా 89బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు ఎటియోస్ క్రాస్ హ్యాచ్‌బ్యాక్‌లో 79బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 67బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.4-లీటర్ ఇంజన్‌లతో కూడా అందుబాటులో ఉంది.

టయోటా ఎటియోస్ క్రాస్-03

మీరు ఆఫ్ రోడింగ్ ప్రియులు అయితే దీనికి పోటీగా ఉన్న మరే ఉత్పత్తులతో పోల్చినా ఇది మంచి ఆఫ్ రోడ్ రైడింగ్‌ లక్షణాలను కలిగి ఉంది. ఆఫ్ రోడ్ రైడింగ్‌లో మీ ప్రయాణాన్ని సురక్షితం చేయడంలో కూడా ముందుంది. 4X4 డ్రైవ్‌ వాహనాన్ని నడుపుతున్న అనుభవాన్ని పొందవచ్చు.

సుమారుగా 400 కిలోమీటర్ల సుదీర్ఘం ప్రయాణం అనంతరం డ్రైవ్‌స్పార్క్‌ బృందం ఈ బీచ్‌ను చేరుకుంది. పూర్తి స్థాయిలో ఏ/సి తో లీటర్‌కు 10 కిలోమీటర్ల వేగంతో, 175 ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్‌తో టయోటా ఎటియోస్ క్రాస్ ద్వారా అడ్వెంచర్ అంచులను చుట్టేసింది ఈ బృందం.

టయోటా ఎటియోస్ క్రాస్-04

సూర్యోదయం తరువాత కొనసాగిన ప్రయాణం కేరళలోని కన్నూర్ జిల్లాలోని కన్నవమ్ అడవుల మీదుగా సాగింది. కన్నవమ్ అడవి తరువాత కొలయాడ్‌లోని కార్నిలియస్ చర్చి ఒక గొప్ప దృశ్యం.

అంతే కాదు ఇది అతి ముఖ్యమైన లాటిన్-క్యాథలిక్ చర్చ్. దీని ముందు ఎటియోస్ క్రాస్ ముందు వైపు డిజైన్‌ను గమనించగలరు. బోల్డ్‌గా ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు టు స్టెప్ ఎయిర్ ఇంటేకర్ ఎంతో స్పోర్టివ్‌గా ఉంటుంది.

టయోటా ఎటియోస్ క్రాస్-05

ఎటియోస్ క్రాస్ ప్రక్క వైపు డిజైన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశాలు బ్లాక్ క్లాడింగ్ మరియు అల్లాయ్ వీల్స్.
టయోటా ఎటియోస్ క్రాస్-06

ఇంటీరియర్ పరంగా అధునాతమైన ఎన్నో ఫీచర్లతో నిండి ఉంది. మరియు ఎంతో విశాలమైన క్యాబిన్‌ కూడా దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలను మరింత సుగమం చేసుకునేందుకు ఇందులో డ్రైవ్ సీటు ఎత్తున అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం మరియు ప్రయాణికుల హెడ్ రెస్ట్‌ల ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం కలదు.

ఇంటీరియర్ స్పేస్‌తో పాటు బూట్ స్పేస్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యం కల్పించింది టయోటా. ఈ ఎటియోస్ క్రాస్‌లో గరిష్టంగా 251-లీటర్ల సామర్థ్యం ఉన్న బూట్ స్పేస్ కలదు. ఇందులో లగేజ్ బ్యాగులు, ట్రావెల్ ల్యాప్‌ట్యాప్ మరియు ఇతర వస్తువులను నింపవచ్చు.

టయోటా ఎటియోస్ క్రాస్-08

డైవ్‌స్పార్క్ బృందంలోని సభ్యుడు "జోబో కురువిల్లా" గారి అనుభవం !
టయటా ఎటియోస్ క్రాస్ ట్రావెల్ రివ్యూలో ముఖ్య పాత్ర వహించిన "జోబో కురువిల్లా" గారు మాట్లాడుతూ, "ఎన్నో ఎళ్ల నుండి విశ్వసనీయమైన ఉత్పత్తులను అందిస్తూ వచ్చిన టయోటా మోటార్స్ తమ ఎటియోస్ క్రాస్‌ను మరింత విశ్వసనీయమైన ఉత్పత్తిగా రూపొందించింది. ఎటియోస్ క్రాస్ తరువాత క్రాసోవర్ బ్యాడ్జిలో మంచి ఉత్పత్తిని అందించింది టయోటా మోటార్స్.

దీని ఎంచుకోవడానికి ఉన్న అతి ముఖ్యమైన అంశం క్రాసోవర్‌లో అవుట్ స్టాండింగ్ ఫర్ఫామెన్స్, ఫీచర్స్. క్రాసోవర్‌ మార్కెట్లో విజయం దీని నుండే ఆరంభం అవుతుందని" తెలిపారు. బీచ్ డ్రైవ్ ట్రావెల్ రివ్యూలో టయోటా ఎటియోస్‌లోని పెట్రోల్ వి వేరియంట్‌ను వినియోగించారు.

టయోటా ఎటియోస్ క్రాస్-07

ప్రయోజనాలు:
  • ఉత్తమ పెట్రోల్ ఇంజన్
  • అద్బుతమైన ఏ/సి సిస్టమ్స్
  • సౌకర్యవంతమైన సీటింగ్
  • క్యాబిన్ స్పేస్ (మంచి లెగ్, షోల్డర్ మరియు హెడ్ రూమ్)
  • స్టోరేజ్ సామర్థ్యం (ఏడు ఒక లీటర్ బాటిళ్లను స్టోర్ చేయవచ్చు)

అప్రయోజనాలు :

  • ఆఫ్ రోడ్ ధృడత్వం
  • ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసే ఓఆర్‌విఎమ్స్ లేకపోవడం
  • స్పీడ్ సెన్సింగ్ ఆటోమేటిక్ డోర్ లాక్స్ లేకపోవడం
  • టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లేకపోవడం

టయోటా ఎటియోస్ క్రాస్ ఫోటోలు...

Most Read Articles

English summary
Review: Toyota Etios Cross — A Crossover Drive To God's Own Country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X