రెండేళ్ళలో చిన్న కార్ల మార్కెట్లోకీ మహింద్రా& మహింద్రా

By

Mahindra may plunge into Small Car
ప్రఖ్యాత ఆటొమొబైల్ కంపెనీ మహింద్రా లొగాన్ కారుతో ఈ సెగ్మెంట్ లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ రంగంలో చిన్న కార్లకు మంచి డిమాండ్ ఉండడంతో భారీ పెట్టుబడులను ఇటువైపు మళ్ళించాలని ఆ సంస్ధ యోచిస్తోంది. 2013 కల్లా మహీంద్రా చిన్న కార్లు మార్కెట్లో ఉండే అవకాశముంది.

మహీంద్రా ఈ చిన్న కార్ల ప్రాజెక్టుకు అంతర్గతంగా ఎస్ 101, ఎస్ 102, ఎస్ 103 అని నామకరణం చేసుకుంది. ఈ చిన్న కార్ల ప్రాజెక్టుపై 800 నుంచి 1400 కోట్ల రూపాయల పెట్టుబడిని మహింద్రా కంపెనీ పెట్టనుంది. ఈ చిన్నకార్ల ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇటలీ నుంచి కారు డిజైనర్లను రప్పించారు. ఈ చిన్న కార్ల ప్రాజెక్టుకు ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ పవన్ గోయెంకా అధిపతిగా వ్యవహరించనున్నారు.

ఫాం ట్రాక్టర్స్, ఎంపీవీలు, ఎస్ యువిలు, టూవీలర్స్ తయారు చేస్తున్న మహింద్రా కంపెనీ ఇండియాలో లీడింగ్ ఆటోమొబైల్ జెయింట్. ఇటీవల ఆటో ఎక్స్ పో లో ఈ కంపెనీ నవిస్టార్ ట్రక్స్, బస్సులు ప్రధాన ఆకర్షణగా మారాయి. అన్ని వాహనాలను తయారు చేస్తున్న ఈ కంపెనీ చిన్న కార్లనే ఇప్పటి వరకు తయారుచేయలేదు. ఈ కొత్త ప్రాజెక్టుతో కంపెనీ సంపూర్ణంగా అన్ని వాహనరంగాల్లో ఉన్నట్టవుతుంది. 2013 కల్లా మహింద్రా చిన్న కార్లు భారతీయులకు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని ఆశించవచ్చు.

Most Read Articles

Story first published: Sunday, June 13, 2010, 17:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X