నానో కారు నడుపుతున్నారా.. అయితే జర జాగ్రత్త గురూ..!!

గత సోమవారం నాడు ముంబై నగరంలో జరిగిన నానో కారు అగ్ని ప్రమాదంతో టాటా మోటార్స్ సంధిగ్ధంలో పడిపోయింది. ఇంతకు ముందు మూడు నానో కార్లు ఇదే విధంగా మంటల్లో చిక్కుకున్నా కారు మొత్తం కాలిపోలేదు. కానీ సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదయిపోయింది. మరి ఇలాంటి సమయంలో ప్రయాణికుడు కారులో వుంటే పరిస్థితి ఏలా వుండేది అని ఊహించడానికే భయంగా వుంది. దీంతో నానో మీద సర్వత్రా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవలే సుజుకీ సంస్థ అధినేత నానో కారుకు మీ సంస్థ పోటీగా కారును తయారుచేసే ఆలోచనా వుందా అన్ని ప్రశ్నకు మేము నానోలా భద్రతా ప్రమాణాలకు నీళ్లొదిలేయలేము అని చెప్పి నానో భద్రత మీద సందేహాన్ని వ్యక్తం చేసారు. ఇలా ఆయన వ్యాఖ్యానించిన వారంలోపే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

మరి ఇంతకు ముందు జరిగిన ప్రమాదాలకు ఏదో చిన్న సాంకేతిక లోపం అని సర్దిచెప్పిన టాటా సంస్థ ఈ ప్రమాదానికి కూడా దాదపు ఇలాంటి సమాధానాన్నే చెప్పింది. కానీ నానో కారును పూర్తిగా పరీక్షించాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఏదో ఓ కమిటీని రూపొందించి చేతులు దులిపేసుకోకుండా నానో కారును రీకాల్ కు పిలుపునిచ్చి ఇప్పటి వరకూ డెలివరీ చేసిన నానో కార్లను కూడా పరీక్షించి సమస్యలను సవరించాల్సిన ఆవస్యకత ఎంతయినా వుంది.

ఇక మొన్న ప్రమాదం బారిన పడ్డ నానో కారు 2.4 లక్షలతో రూపొందిన ఆధునిక సదుపాయాలతో రూపొందించినది. ఎంతో ఖర్చు పెట్టిన ఆధునికమయిన నానోకే ఈ గతి పడితే మరి లక్షా పాతికవేలకే లభించే బేసిక్ మోడళ్ల గతేంటో మరి..?? కనుక నానో వినియోగదారులారా పారాహుషార్...ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి జర జాగ్రత్తగా వుండండి...!!

కార్లను పోల్చు

టాటా నానో
టాటా నానో వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Please Wait while comments are loading...

Latest Photos