నిర్లక్ష్యానికి పరాకాష్ట 'నానో'

By

Tata Nano
గత నెల మార్చి 21న ముంబైలోని సతీష్ పురుషోత్తం సావంత్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తను కొత్తగా కొన్న నానో కారులో తన భార్య, కొడుకుతో ఇంటి వెళ్తుండగా మార్గమధ్యలో హఠాత్తుగా కారు అగ్నిలో చిక్కుకుని కాలి బూడిదయింది. కారు కొని అరగంట కూడా కాకుండానే కారు ఇలా బుగ్గిపాలు అవడంతో సతీష్, అతని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు లోనయ్యారు.

దీంతో ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. కానీ టాటా మోటార్స్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. టాటా మోటార్స్ సంస్థ ఓ విచారణకు ఆదేశించి సతీష్ కు ఓ ఉత్తరం పంపించి చేతులు దులిపేసుకుంది. సతీష్ కు రాసిన ఉత్తరంలో కనీసం ఆయనకు క్షమాపన కూడా చెప్పకపోవడం ఆయన్ని మరింతగా కలచివేసింది. దీంతో ఆయన టాటా మోటార్స్ మీద గుర్రుగా వున్నాడు. ఈ విషయమై ఆరా తీద్దామని టాటా మోటార్స్ ఆఫీసుకు వెళ్తే అక్కడి అధినేత గారు నేను చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ చాలా సార్లు కింద పడిపోయాను. ఏలా పడిలేస్తూనే ఆ తర్వాత సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. అలాగే నానో కారు రూపొందించడంలో ఈ లోపం దొర్లింది. ఆ తర్వాత ఈ లోపాన్ని సరిచేస్తాం అంటూ చాలా నిర్లక్ష్యంగా జవాబివ్వడం అందరినీ ఆష్చర్యపరిచింది.

దీంతో విసిగిపోయిన సతీష్ తనకు న్యాయం జరిగే వరకూ టాటా మోటార్స్ మీద పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేసాడు.

Most Read Articles

Story first published: Thursday, April 1, 2010, 11:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X