మహీంద్రా స్కార్పియోలో కొత్త వేరియంట్‌ను విడుదల

Mahindra Scorpio
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) స్కార్పియోలో ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన స్కార్పియో ఎల్ఎక్స్ వేరియంట్ ఎస్‌యూవీ‌ని ఎమ్ అండ్ ఎమ్ ఆవిష్కరించింది. త్వరలో టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి రానున్న సరికొత్త సఫారీకు ధీటుగా ఈ కొత్త స్కార్పియో ఎల్ఎక్స్ (4x4) నిలువనుంది.

ప్రస్తుతం ఉన్న స్కార్పియో ఎల్ఎక్స్ వేరియంట్ మాదిరిగానే స్కార్పియో ఎల్ఎక్స్ (4x4) కూడా ఉంటుంది. అంటే దీని డిజైన్‌లోను మరియు ఇంజన్‌లోను ఎలాంటి మార్పులు లేవన్నమాట. ఇందులో 2.2 లీటర్ ఎమ్‌హాక్ సిఆర్‌డిఈ టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 120 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 290 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.

సరికొత్త స్కార్పియో ఎల్ఎక్స్ (4x4) వేరియంట్లో లభించే ఫీచర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
- 5-జోన్ కుషన్ సస్పెన్షన్
- డిజిటల్ ఇమ్మొబిలైజర్
- క్రాష్ ప్రొటెక్షన్ క్రంపల్ జోన్స్, చైల్డ్ లాక్స్
- ట్యూబ్‌లెస్ టైర్లు
- టిల్ట్ స్టీరింగ్
- పవర్ స్టీరింగ్, పవర్ విండోస్
- మొబైల్ చార్జింగ్ పాయింట్
- ఇల్యుమినేటెడ్ స్పాయిలర్
- రూఫ్ టాప్ స్కై ర్యాక్స్
- సెంట్రల్ లాకింగ్

మొదలగు అత్యాధునిక సాంకేతి, భద్రతా మరియు ఆకర్షనీయమైన ఫీచర్లు కొత్త స్కార్పియో ఎల్ఎక్స్ (4x4) ఎస్‌యూవీ సొంతం. దేశీయ విపణిలో ఈ మోడల్ ధర రూ.9.17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Mahindra has silently launched a no frills variant of the 4X4 Scorpio in the form of the Scorpio SLX 4X4. This new variant will be the mid level Scorpio and will come with four wheel drive but will not have several features that one can see in the top end variant. The new Scorpio is for some one who needs to drive through rough terrain without the need of luxury features.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X