భారత్, మధ్యప్రాశ్చ్య ట్రక్ విభాగాలపై దృష్టి సారించిన డైమ్లర్

Daimler Truck
జర్మనీకు చెందిన ప్రముఖ ట్రక్కుల తయారీ సంస్థ డైమ్లర్ ఏజి, ఇకపై భారత్, మధ్యప్రాషశ్చ్య మార్కెట్లపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అబుదాబికు చెందిన అబర్ ఇన్వెస్టిమెంట్స్ పిజెఎస్‌తోనూ, అల్జీరియా ప్రభుత్వంతోనూ ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడిచింది. ఈ ఒప్పందంలో భాగంగా డైమ్లర్ కంపెనీ అబర్‌ సంస్థకు ట్రక్కులు, బస్సులను తయారీ చేసివ్వాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంలో అబర్‌కు 9 శాతం వాటాను కలిగి ఉంటుంది. తమ వాహనాలకు అత్యంత పటిష్ట మార్కెట్లయిన ఉత్తర ఆఫ్రికా, అల్జీరియాలలో అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కంపెనీ అధికారిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

అల్జీరియన్ మార్కెట్ల కోసం విడిభాగాలను, టెక్నాలజీను కంపెనీ సరఫరా చేయనుంది. అలాగే.. భారత్ మార్కెట్ కోసం కూడా ఓ సరికొత్త ట్రక్‌ను వచ్చే ఏడాది నాటికి టాటా మోటార్స్‌తో భాగస్వామ్యంగా ఏర్పడి రూపొందించనుంది. భారత్‌బెంజ్ బ్రాండ్ పేరుతో 6 టన్నుల నంచి 49 టన్నుల వరకూ సామర్థ్యం కలిగిన ట్రక్‌లను భారత మార్కెట్లో కంపెనీ అందించనుంది. చెన్నయ్‌కు సమీపంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో ఈ ట్రక్కులను ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాంటు 2012 నాటికి తుది దశకు రానుంది. ఇక్కడ ఉత్పత్తి అయిన వాహనాలను ఇతర మార్కెట్లకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
The German auto maker of Truck fame Daimler AG is said to have inked an MoU with Abu Dhabi's Aabar Investments PJS and the Algeria Government. The MoU will pave way for manufacturing trucks and buses and in turn the Aabar will be entitled to 9% share in Daimler.
Story first published: Monday, March 28, 2011, 11:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X