ఫోర్స్ మోటార్స్, డైమ్లర్ ఏజిల జేవీ నుంచి ఎమ్‌పివి!

Force Trax Gurkha
ఇటు ఇండియా కంపెనీ అటు జర్మన్ కంపెనీలు రెండు చేతులు కలిపితే ఎలా ఉంటుంది. ఇంకేముంది... నాసామిరంగా.. ఈ జాయింట్ వెంచర్ నుంచి వచ్చే ఉత్పత్తికి మరొకరు పోటీ రాగాలరా అన్నట్లుగా ఉంటుంది. వాణిజ్య వాహనాల తయారీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పూణేకు చెందిన భారతీయ ఆటో దిగ్గజం 'ఫోర్స్ మోటార్స్' మరియు జర్మనీకు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ అయిన 'డైమ్లర్ ఏజి'లు భారత మార్కెట్ కోసం ఓ మల్టీ పర్పస్ వాహనాన్ని (ఎమ్‌పివి) రూపొందించేందుకు చేతులు కలిపాయి.

ఇప్పటివరకూ టెంపో ట్రావెలర్, ట్రాక్స్ క్రూయిజర్, ట్రాక్టర్ వంటి వాణిజ్య వాహనాలు రూపొందిస్తున్న ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా ప్యాసింజర్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్ కోసం ఓ ఎమ్‌పివి రూపొందించేందుకు డైమ్లర్ ఏజితో ఫోర్స్ మోటార్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఫోర్స్ మోటార్స్ అభివృద్ధి చేస్తున్న ఎమ్‌పివికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మద్దతును డైమ్లర్ ఏజి అందించాల్సి ఉంటుంది.

ఈ జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేయబడుతున్న ఫోర్స్ మోటార్స్ ఎమ్‌పివి 2012 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంచితే.. ఫోర్స్ మోటార్స్ తన స్వంత టెక్నాలజీతో మరొక ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని)ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్ మోటార్స్ నుంచి రెండు ప్యాసింజర్ వాహనాలు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

Most Read Articles

English summary
Commercial vehicles maker Force Motors Ltd has signed a licence agreement with Daimler AG, to supply technology for their multi-purpose vehicle (MPV), which is due for launch by end-2012 in Indian market.
Story first published: Tuesday, July 26, 2011, 17:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X