త్వరలో ఎస్‌యూవీని విడుదల చేయనున్న ఫోర్స్ మోటార్స్

Force Motors
ప్రముఖ యుటిలిటీ, వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ (ఎఫ్ఎమ్ఎల్) ప్యాసింజర్ వాహన విభాగంలో ఓ సరికొత్త స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని (ఎస్‌యూవీ) ప్రవేశపెట్టలాని భావిస్తుంది. ఈ ఏడాదిలో ఓ దేశీయ వినియోగదారుల కోసం ఓ ఎస్‌యూవీను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఎస్‌యూవీను విడుదల చేసిన మొదటి సంవత్సరంలోనే 4,000 వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డెరెక్టర్ ప్రసన్ ఫిరోడియా వెల్లడించారు.

కాగా.. ఫోర్స్ మోటార్స్ గడచిన ఆర్థిక సంవత్సరం (2010-11)లో సంస్థ నికర 2.98 శాతం తగ్గుదలను నమోదు చేసుకుంది. మార్చి 31 ,2011తో ముగిసిన 2010-11 ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ నికర లాభాలు 2.98 శాతం క్షీణించి రూ. 58.62 కోట్లకు పడిపోయాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నికర లాభాలను రూ. 60.42 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్మాల్ కమర్షియల్ వెహికల్స్(ఎస్‌సీవీ), మల్టీ యుటిలిటి వెహికల్స్ (ఎమ్‌యూవీ), లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్‌సీవీ), వ్యవసాయ ట్రాక్టర్లు, హెవీ కమర్షియల్ వెహికల్స్ (హెచ్‌సీవీ) సెగ్మెంట్లలో వాహనాలను అందిస్తోంది.

Most Read Articles

English summary
Commercial vehicles maker Force Motors Ltd said, it is planning to launch a Sports Utility Vehicles (SUV) for Indian market later this year.
Story first published: Thursday, June 23, 2011, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X