రాష్ట్ర మార్కెట్లో ఫోర్స్ వన్‌ను ఆవిష్కరించిన ఫోర్స్ మోటార్స్

Force One SUV
ప్రముఖ యుటిలిటీ వానాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా ప్యాసింజర్ వాహన విభాగంలో అందిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) 'ఫోర్స్ వన్'ను కంపెనీ రాష్ట్ర మార్కెట్లోకి కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. గడచిన ఆగస్టు నెలలో ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఫోర్స్ మోటార్స్ తమ 'ఫోర్స్ వన్' ఎస్‌యూవీని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఫోర్స్ వన్ ఎస్‌యూవీ సాంకేతిక వివరాలు:

కాగా.. ఫోర్స్ వన్ ఎస్‌యూవీ కోసం కంపెనీ హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లో ఓ కొత్త షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఫోర్స్‌ మోటార్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రసన్‌ ఫిరోడియాలు ప్రారంభించారు. ఫోర్స్ వన్ ఎస్‌యూవీలో ఉపయోగించిన 2148 సీసీ ఇన్‌లైన్-ఫోర్ డీజిల్ ఇంజన్ 138 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 32 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్స్ వన్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'బిగ్ బి'

ప్రస్తుతం ఫోర్స్ వన్ ఎస్‌యూవీ టూ-వీల్ (4x2) డ్రైవ్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. త్వరలో ఇందిలో ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఫోర్స్ వన్ ఎస్‌యూవీ లీటరుకు 11.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. రాష్ట్ర విపణిలో ఫోర్స్ వన్ ఎస్‌యూవీ ధర రూ.10.84 లక్షలు (ఎక్స్‌-షోరూమ్, హైదరాబాద్)గా ఫోర్స్ మోటార్స్ నిర్ణయించింది.

Most Read Articles

English summary
Force Motors Managing Director Prasan Firodia who inaugurated Force Motors' new showroom in Hyderabad spoke about the company's investment plans. The investment will mean we will see stable mates to the recently launched Force One. The Force One is the company's only passenger vehicle.
Story first published: Wednesday, November 23, 2011, 14:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X