ఆటో రంగంలో మరిన్ని అమెరికన్ పెట్టుబడులను కోరిన జయ

Jaya-Hillary
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ తమిళనాడు పర్యటనతో, ఆ దేశం నుంచి తమిళనాడు రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనబడున్నాయి. ఈ మేరకు తమ రాష్ట్రంలోని ఆటోమోటివ్ విభాగంలో అమెరికన్ పెట్టుబడులను పెంచేందుకు సహకరించాల్సిందిగా హిల్లరీ క్లింటన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విజ్ఞప్తి చేశారు. చెన్నై సచివాలయంలో సమావేశమైన హిల్లరీతో జయలలిత తన మనసులోని మాట బయటపెట్టారు.

చెన్నైలో ఇప్పటికే అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ ఒక ప్లాంటును కలిగి ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీలు తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందు సహకరించాలని జయలలిత కోరారు. తమిళనాడు రాజధాని చెన్నైలో విదేశీ కంపెనీలయిన హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, నిస్సాన్ మరియు రీనాల్ట్ వంటి కంపెనీలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో ఇది భారత ఆటోమోటివ్ హబ్‌గా అవతరించింది. అంతేకాకుండా.. ఈ కంపెనీల అవసరాలను తీర్చేందుకు విదేశీ విడిభాగాల కంపెనీలు కూడా భారత్‌కు రావడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మరిన్ని అమెరికన్ ఆటో కంపెనీలు చెన్నైను ఆశ్రయిస్తే తమిళనాడు గ్లోబల్ ఆటోమోటివ్ హబ్‌గా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. కాగా... ఇప్పటికే చెన్నైలో ఉన్న ఫోర్డ్ కంపెనీ తన రెండో ప్లాంటు ఏర్పాటు విషయంలో మాత్రం గుజరాత్‌ను ఆశ్రయిస్తుండటం గమనార్హం. అలాగే.. భారత్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఫ్రెంచ్ కార్ల దిగ్గజం ప్యూజో కూడా తమిళనాడులో ప్లాంటు ఏర్పాటు విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. జయలలిత తాజా వ్యాఖ్యలను బట్టి గమనిస్తే, రాష్ట్రం నుంచి జారిపోతున్న ఆటో కంపెనీలను తిరిగి వెనక్కు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

Most Read Articles

English summary
Tamil Nadu Chief Minister J Jayalalitha has sought visiting US Secretary of State Hillary Clinton to help increase American investment in the states automotive segment. The chief minister has expressed her wish to Mrs Clinton when the American Diplomat called on the her at the Chennai Secretariat.
Story first published: Friday, July 22, 2011, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X