సమ్మర్ చెకప్ క్యాంప్‌ను ప్రారంభించిన స్కోడా ఆటో ఇండియా

Skoda Auto
చెక్ రిపబ్లిక్‌కు చెందిన స్కోడా ఆటో భారత అనుబంధ సంస్థ అయిన స్కోడా ఆటో ఇండియా.. భారత్‌లో తమ కార్ల యజమానులకు, వినియోగదారులకు.. వేసవి సందర్భంగా ఓ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్ల ప్రకటించింది. భారత్‌లోని స్కోడా వినియోగదారులు తమ కార్లను ఉచితంగా చెకప్ చేయించుకునే సదుపాయాన్ని "స్కోడా సమ్మర్ చెకప్ క్యాంప్" ద్వారా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఉచిత సర్వీసింగ్ క్యాంప్ ఏప్రిల్ 1, 2011 నుండి ఏప్రిల్ 30, 2011 వరకూ నిర్వహించనున్నట్లు కంపెనీ వివరించింది.

ఈ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా స్కోడా కార్లను ఉచితంగా 16 పాయింట్ చెకప్ చేస్తామని కంపెనీ తెలిపింది. కారు ఏసి, ఇంజన్, స్టీరింగ్, క్లచ్, ఎలక్ట్రకల్ సిస్టమ్, టైర్స్ అండ్ వీల్ రిమ్స్ వంటి ముఖ్యమై భాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపాలేవైనా ఉంటే సవరించడం జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా కంపెనీ దాదాపు 20,000 స్కోడా కార్లను తనిఖీ చేయాలనే లక్ష్యంతో ఉంది.

తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో కంపెనీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఈ సమ్మర్ క్యాంప్‌ను స్కోడై యజమానులు సద్వినియోగం చేసుకోవాలని స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ అండ్ బోర్డు మెంబర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) థామస్ కుయెహ్ల్ పేర్కొన్నారు.

Most Read Articles

English summary
Czech Republic based car maker, Skoda Auto said, company has introduced a special summer checkup camp for its customers in India. This summer checkup camp will run from April 1, 2011 to April 30, 2011.
Story first published: Tuesday, April 5, 2011, 13:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X