Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

ఫేస్‌లిఫ్ట్ చెవర్లే క్రూజ్‌ని ఆవిష్కరించిన జనరల్ మోటార్స్

Posted by:
Published: Thursday, May 31, 2012, 16:52 [IST]

అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌కు చెందిన కార్ బ్రాండ్ చెవర్లే అందిస్తున్న పవర్‌ఫుల్ సెడాన్ 'చెవర్లే క్రూజ్'లో ఓ సరికొత్త వెర్షన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. చెవర్లో బ్రాండ్‌లో అత్యంత పాపులర్ అయిన చెవర్లే క్రూజ్ సెడాన్‌ను అప్‌గ్రేడ్, దానికి ఆధునిక హంగులు జోడించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన 2012 బుసాన్ మోటార్ షోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.

కొద్దిగా మార్పు చేయబడిన ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, సరికొత్త హెడ్‌ల్యాంప్స్ అండ్ ఫాగ్‌ల్యాంప్స్, కొత్త డిజైన్ కలిగి అల్లాయ్ వీల్స్ వంటి మార్పులను ఈ అప్‌గ్రేడెడ్ క్రూజ్‌లో గమనించవచ్చు. గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని, దానికి అనుగుణమైన ఇంటిరీయర్లు ఎక్స్టీరియర్లో ఈ సరికొత్త చెవర్లే క్రూజ్‌ను జనరల్ మోటార్స్ రూపొందించింది. కారు లోపల గమనిస్తే, ఇంటీరియర్స్‌లో పెద్దగా మార్పులు లేవు కానీ, మరింత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసిన వెనుక సీట్, ఎయిర్ వెంట్స్, సరికొత్త ఆడియో సిస్టమ్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.

2013 chevrolet cruze facelift unveiled korea

ఈ కొత్త చెవర్లే క్రూజ్‌లో సరికొత్త ఇంజన్ (జెడ్ సిరీస్)ను ఉపయోగించారు. ఈ 2.0 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 161 బిహెచ్‌పిల శక్తిని, 36.4 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభిస్తుంది. చెవర్లే ఆవిష్కరించిన ఈ కొత్త క్రూజ్ సెడాన్ ఇండియన్ మార్కెట్‌కు కూడా వచ్చే ఆవకాశం ఉంది. అయితే, ఇందుకు కనీసం మరొక ఏడాది సమయమైనా పట్టవచ్చని అంచనా.

English summary
US auto major General Motors has unveiled the facelifted 2013 Chevrolet Cruze sedan at recently concluded 2012 Busan Motor Show in South Korea. New Cruze gets minor interior and exterior upgrades. It is expected to hit the Indian roads by 2013.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu