జనవరి 11 నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ ఆటో షో

Written by:
Published: Saturday, December 22, 2012, 15:01 [IST]
 

రాజధానిలోని ఆటోమొబైల్ ప్రియులను అలరించేందుకు 4వ హైదరాబాద్ అంతర్జాతీయ ఆటో షో సిద్ధమైంది. గత మూడేళ్లుగా (2009, 2010, 2011 సంవత్సరాల్లో) విజయవంతంగా నిర్వహించబడిన ఈ అంతర్జాతీయ వేడుక ఈసారి సరికొత్త హంగులతో హైదరాబాదీలను ఆకట్టుకునేందుకు ముస్తాయబయింది. ఈ ఫోర్త్ ఎడిషన్ 2013 హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆటో షోను ఎప్పటిలాగే హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. జనవరి 11, 2013 నుంచి జనవరి 13, 2013 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది.

మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఆటో షోలో పలు దేశీయ, విదేశీయ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. ఈనాడు-విస్టా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో ఈ ఆటో షోను నిర్వహిస్తున్నారు. జాగ్వర్‌ ల్యాండ్ రోవర్, బెంట్లీ, ఆస్టన్‌ మార్టిన్‌, వోల్వో, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్‌, పోర్డ్‌, స్కోడా, టొయోటా, నిస్సాన్ బిఎమ్‌డబ్ల్యూ, ఫోక్స్‌వ్యాగన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచనున్నాయి.

జనవరి 11 నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ ఆటో షో

కేవలం కార్ కంపెనీలు మాత్రమే కాకుండా, హార్లే డేవిడ్‌సన్‌, డ్యుకాటి, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్, హోండా మోటార్‌సైకిల్స్, యమహా, బజాజ్ ఆటో, సుజుకి మోటార్‌సైకిల్స్ వంటి ద్విచక్ర వాహనా కంపెనీలు కూడా తమ విస్తృతస్థాయి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ ఆటో షో కోసం హైటెక్స్ గ్రౌండ్స్‌లో వేదికల స్థలాన్ని 18,000 చ.మీ. విస్తరించారు. ఈసారి ఆటో షోలో హీలియం బలూన్స్, స్టంట్ బైకర్స్, రిమోట్ కంట్రోల్డ్ కార్స్, కార్ సిమ్యులేటర్స్ వంటి అనేక వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు.

అంతేకాకుండా, జనవరి 13, 2012వ తేదీన సాయంత్రం 'నైట్ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్' (గాలి పటాల పండుగ)ను కూడా నిర్వహించనున్నారు. డిజే ప్లేయింగ్, ఫుడ్ కోర్ట్స్, చిన్న పిల్లల వినోదం కోసం గేమ్స్ వంటి పలు కార్యక్రమాలతో, ఈ వేదికు విచ్చే కుటుంబాలకు పూర్తి స్థాయి వినోదాన్ని కల్పించేలా ఈ వేడుకను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టికెట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. బుక్ మై షో డాట్‌కామ్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. టికెట్ ధర రూ.200 (ప్రతి వ్యక్తి)గా ఉంది. 2 సంవత్సరాలలోపు పిల్లలకు మాత్రం ప్రవేశం ఉచితం.

English summary

2013 Hyderabad International Auto Show Dates Announced | జనవరి 11 నుంచి హైదరాబాద్ అంతర్జాతీయ ఆటో షో

After 3 successful years of hosting the Hyderabad International Auto Show, in 2009, 2010 & 2011, the 4th edition of the Auto show is back again with a bigger and better avatar, starting from 11th to 13th of January at HICC and Hi-Tex exhibition grounds, Hyderabad.
మీ వ్యాఖ్య రాయండి

Latest Photos

Latest Videos

Free Newsletter

Sign up for daily auto updates

New Launches