బ్రయో బుకింగ్స్‌ను పునఃప్రారంభించిన హోండా

బుదవారం, ఫిబ్రవరి 22, 2012, 15:17 [IST]
హోండా సియోల్ కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ అందిస్తున్న చిన్న కారు 'బ్రయో' ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతుండటంతో కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్‌లను పునఃప్రారంభిస్తాన్నామని కంపెనీ తెలిపింది. ఇటీవల థాయ్‌లాండ్‌లో సంభవించిన వరదల వల్ల ఏర్పడిన విడిభాగాల కొరత కారణంగా, బ్రయో ఉత్పత్తి నిలిచిపోవటంతో కంపెనీ దీని బుకింగ్‌లను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హోండాకు విడిభాగాల సమస్య సమసిపోవడంతో ఇండియాలో బ్రయో ఉత్పత్తి రెట్టింపు సామర్థ్యంతో ప్రారంభించింది. ఇప్పటికే వెయిటింగ్‌ పీరియడ్‌లో ఉన్న అన్ని హోండా బ్రయో బుకింగ్‌లను మార్చిలోగా క్లియర్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. గ్రేటర్‌ నోయిడాలోని హోండా ప్లాంటులో రోజుకు 370 కార్లను తయారవుతుండగా, ప్రస్తుతం రెండు షిఫ్టులను ప్రారంభించి రోజుకు 440 యూనిట్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

హోండా బ్రయో 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 88 బిహెచ్‌పిల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. గడచిన సెప్టెంబర్ నెలలో కేవలం రూ.3.95 లక్షల ప్రారంభ ధరకే బ్రయో చిన్న కారును హోండా భారత మార్కెట్లో విడుదల చేసింది. హోండా బ్రయోలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్, పవర్ విండోస్, యూఎస్‌బి, ఆక్స్ కనెక్టివిటీతో కూడిన 4స్పీకర్ 2డిన్ స్టీరియో సిస్టమ్ వం కూడా లభిస్తుంది.

హోండా బ్రయో 3610 మి.మీ. పొడవును, 1680 మి.మీ. వెడల్పును, 1500 మి.మీ. ఎత్తును మరియు 2345 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. హోండా బ్రయో లీటరుకు 18.4 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 83 నగరాల్లో 135 హోండా డీలర్‌షిప్‌లలో ఈ చిన్న కారు లభ్యమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇది రెండు సంవత్సరాలు లేదా 40,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

హోండా బ్రయో చిన్న కారు ఎనర్జిటిక్ బ్లూ, ర్యాల్లీ రెడ్, అర్బన్ టైటానియం, ఆల్బస్టర్ సిల్వర్, టాఫ్ఫెటా వైట్ మరియు క్రిస్టల్ బ్లాక్ పెరల్ అనే ఆరు ఆకర్షనీయమై రంగుల్లో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
English summary
Honda has reopened the bookings of the Brio hatchback months after it stopped it following the crisis in Thailand. The Japanese carmaker which recently got back to full scale production has said people can now book the Brio in all its showrooms in India.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .