Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

Posted by:
Published: Friday, August 10, 2012, 17:29 [IST]

Anand Mahindra Appointed As M And M Chairman

ఆనంద్ మహీంద్రా చేతికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ పగ్గాలు లభించాయి. గడచిన 45 ఏళ్లు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలకు సారథ్యం వహిస్తూ వచ్చి కెషుబ్ మహీంద్రా తన పదవీవిరమణను ప్రకటించడంతో ఈ సంస్థకు చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా బాధ్యతలు చేపట్టనున్నారు.

కెషుబ్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుకు 64 ఏళ్లు డైరెక్టర్‌గా సేవలందించారు. స్టీల్ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభమైన ఈ సంస్థను ప్రస్తుతం వివిధ రంగాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేలా చేశారు. ప్రస్తుతం మహీంద్రా గ్రూపు విలువ 15.4 బిలియన్ అమెరికన్ డాలర్లు.

ఇప్పటి వరకూ మహీంద్రా అండ్ మహీంద్రాకు వైస్-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన ఆనంద్ మహీంద్రా ఇకపై చైర్మన్‌గా కొనసాగనున్నారు. ఈ ఏడాది చాలా క్లిష్టమైనదని, అనేక సవాళ్లతో కూడుకున్నదని కంపెనీ వార్షిక సమావేశంలో కెషుబ్ మహీంద్రా తెలిపారు. కెషుబ్ మహీంద్రా (88 ఏళ్లు) చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఈ గ్రూపుకు చైర్మన్ మెరిట్యూస్‌గా కొనసాగనున్నారు.

English summary
After leading the group for over 45 years, Keshub Mahindra retired as Chairman of Mahindra & Mahindra group and said it is time to "break new grounds" for the company under his successor Anand.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu