సమ్మె ఎఫెక్ట్: క్యూ3లో భారీగా క్షీణించిన సియట్ లాభాలు

Ceat Profits
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో నిరుత్సాహకరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31, 2011తో ముగిసిన మూడో త్రైమాసికం (ఏప్రిల్ 2011 - జులై 2011)లో కంపెనీ నికర లాభం 52.30 శాతం క్షీణించి రూ.2.39 కోట్లుగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నికర లాభాలు రూ.5.01 కోట్లుగా ఉన్నట్లు సియట్ బిఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. నాసిక్ ప్లాంటులో తలెత్తిన కార్మిక అనిశ్చితి కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని కంపెనీ పేర్కొంది. అయితే, ఈ సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 19.04 శాతం వృద్ధి చెంది రూ.895.01 కోట్ల నుండి రూ.1,065.44 కోట్లకు పెరిగింది.

నాసిక్‌లోని సియట్ ప్లాంటులో సెప్టెంబర్ 30, 2011 నుండి అక్టోబర్ 22, 2011 వరకూ కార్మికులు సమ్మెను నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావలనం మూడో త్రైమాసికంలో భారీగా నష్టపోవాల్సి వచ్చిందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది.

Most Read Articles

English summary
Tyre maker, Ceat, on Tuesday reported 52.30 per cent decline in net profit for the quarter ended December 31, at Rs 2.39 crore due to labour unrest at its Nashik facility.
Story first published: Wednesday, January 25, 2012, 17:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X