Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

కాంపాక్ట్ ఎస్‌యూవీ చెవర్లే ట్రాక్స్‌ను రిలీజ్ చేసిన జిఎమ్

Posted by:
Published: Thursday, May 24, 2012, 17:33 [IST]

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో, అమెరికా ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్‌కు చెందిన ఓపెల్ బ్రాండ్‌లో అందిస్తున్న 'ఓపెల్ మోక్కా' మోడల్‌ను ఆధారంగా చేసుకుని చెవర్లే బ్రాండ్‌లో అభివృద్ధి చేసిన ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'చెవర్లే ట్రాక్స్'ను కంపెనీ ఆవిష్కరించింద. త్వరలో జరగనున్న ప్యారిస్ మోటార్ షోలో జనరల్ మోటార్స్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ చెవర్లే ట్రాక్స్‌ను ప్రదర్శించనుంది.

చెవర్లే ట్రాక్స్ 4.2 మీటర్ల పొడవును కలిగి ఉండి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు అనేక గ్లోబల్ మార్కెట్లలో ఇది పోటీగా నిలువనుంది. ఈ ఏడాది యూరప్ మార్కెట్లలో అమ్ముడుకానున్న ఓపెల్ మోక్కా ఎస్‌యూవీ ఆధారంగా చేసుకొని, చెవర్లే ట్రాక్స్‌ను డిజైన్ చేశారు. ఓపెల్ మోక్కాలో 1.4 లీటర్ పెట్రోల్, 1.7 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. ఇవి రెండు కూడా సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లో లభ్యం కానున్నాయి.

chevrolet releases first image trax compact suv

ఇదే ఇంజన్లను చెవర్లే ట్రాక్స్‌ ఎస్‌యూవీలోనూ ఉపయోగించనున్నారు. అన్ని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన వేరియంట్లు ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తాయి. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సి), ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఏ), హిల్ డిసెంట్ కంట్రోల్ (హెచ్‌డిసి) వంటి భద్రత/సురక్షిత ఫీచర్లు స్టాండర్డ్‌గా లభించనున్నాయి. ఈ ఏడాది స్టెప్టెంబర్ నెలలో జరగనున్న ప్యారిస్ మోటార్ షోలో తొలిసారిగా చెవర్లే ట్రాక్స్‌ను ప్రజల సందర్శనార్థం జనరల్ మోటార్స్ ప్రదర్శనకు ఉంచనుంది.

English summary
Chevrolet has released the first image of its new Trax compact SUV. The Trax is set to make its debut at the Paris Motor Show in September. The five-seater Trax SUV will take on the likes of the upcoming Ford EcoSport SUV which is readying for India launch sometime soon. The 4.2 metre long, muscular looking SUV is expected to go on sale in Europe by early 2013.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu