భారత్‌బెంజ్ ట్రక్కుల శ్రేణిని ఆవిష్కరించిన డైమ్లర్

Posted by:

ప్రపంచంలో అగ్రగామి ట్రక్‌ల తయారీ సంస్థ డైమ్లర్‌ ఏజి భారతదేశపు అనుబంధ సంస్థ డైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డిఐసివి) 'భారత్‌బెంజ్‌' బ్రాండ్‌ పేరుతో రూపొందించి సరికొత్త ట్రక్కులను కంపెనీ మార్కెట్లో ఆవిష్కరించింది. మొత్తం ఎనిమిది రకాల ట్రక్కులను కంపెనీ ప్రదర్శించింది. జర్మనీకి చెందిన డిఐసివి ఈ ట్రక్కులను చెన్నై ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌బెంజ్‌ బ్రాండ్‌తో తయారైన ఈ వాహనాలను తొలిసారిగా హైదరాబాద్‌ నుండి అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలోకి కంపెనీ విడుదల చేసింది. 2012 తృతీయ త్రైమాసికంలో ఈ వాహనాల విక్రయాలను ప్రారంభించనున్నామని, రానున్న 20 నెలల్లో మరో 17 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఆవిష్కరించిన భారత్‌బెంజ్‌ ట్రక్కుల శ్రేణిలో 9, 12, 25, 31, 49 టన్నుల విభాగాల్లో లైట్‌ డ్యూటీ ట్రక్కు లు, హెవీ డ్యూటీ ట్రక్కులు ఉన్నాయి.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
German global truck maker Daimler AG's Indian subsidiary Daimler India Commercial Vehicles (DICV), has unveiled a range of trucks under Bharat Benz brand to be manufactured at their Greenfield plant located near Chennai.
Please Wait while comments are loading...

Latest Photos