నెలకు రూ.15,999 ఉంటే చాలు.. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మీ సొంతం

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 13:14 [IST]
బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్ కార్లంటే.. అమ్మో అంత ఖరీదైన కార్లు కొనడం మన వల్ల అవుతుందా అని వాటిని దూరం నుండి చూసి మురిసిపోవడంతో సరిపెట్టుకుంటాం. ఇది ఒకప్పటి మాట. నిజమే బిఎమ్‌డబ్ల్యూ కార్లు చాలా ఖరీదుతో కూడుకున్నవి. అయితే, ప్రస్తుతం లగ్జరీ/ప్రీమియం కార్ మార్కెట్ పరిమాణం పెరుగుతుండటం, దేశీయ మార్కెట్లో వివిధ ఫారిన్ బ్రాండ్‌లు తక్కువ ధరలకే తమ కార్లను విడుదల చేస్తుడంతో ఈ సెగ్మెంట్లో పోటీ పెరిగింది.

పెరిగిన పోటీని తట్టుకునేందుకు, బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో అందిస్తున్న చీపెస్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్1' (ప్రారంభ ధర రూ.22 లక్షలు, ఎక్స్-షోరూమ్) కోసం ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. బిఎమ్‌డబ్ల్యూకు చెందిన ఆర్థిక విభాగం "బిఎమ్‌డబ్ల్యూ ఫైనాన్షిల్ సర్వీసెస్" ఎక్స్1 ఎస్‌యూవీ సులభ వాయిదా పద్ధతి (ఈఎమ్ఐ) ఆఫర్‌ను అందిస్తోంది.

ఈ ఆఫర్‌లో భాగంగా, ప్రతి నెల కేవలం రూ.15,999 చెల్లించి బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యూవీని సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మీ సమీపంలోని బిఎమ్‌డబ్ల్యూ డీలర్‌ నుండి పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 31, 2012 వరకూ చెల్లుబాటులో ఉంటుంది.
English summary
The BMW X1 offers the best in terms of sheer driving pleasure , ample space and off road drive ability. It is now available at a low EMI of just Rs.15,999. The X1 SUV has a starting price of Rs.22 lakhs. Offer valid till March 31, 2012.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .