Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

దీపావళి మార్కెట్లోకి రానున్న హోండా బ్రయో డీజిల్ కారు

Posted by:
Published: Saturday, June 2, 2012, 15:33 [IST]

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ ట్రెండ్ మారింది. అసలు డీజిల్ కార్ల గురించి పూర్తిగా తెలియని వాళ్లు సైతం ఇప్పుడు డీజిల్ కార్లనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలే. పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసిన తర్వాత చమురు కంపెనీలు తమ ఇష్టానుసారంగా ధరలను పెంచుతుండటం, పెట్రోల్ ధరకు మరియు డీజిల్ ధరకు మధ్య వత్యాసం ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు డీజిల్ కార్లను ఎంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచికి తగినట్లుగా, ఆటోమొబైల్ కంపెనీలు కూడా డీజిల్ కార్ల తయారీకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే డీజిల్ కార్లను తయారు చేస్తున్న కంపెనీలు వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే పనిలో ఉండగా, మరికొన్ని కంపెనీలు పాపులర్ మోడళ్లలో డీజిల్ కార్లను ఆఫర్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే, అసలే డీజిల్ కార్లంటే ఏంటో తెలియని జపనీస్ కార్ బ్రాండ్ హోండా మోటార్స్ కూడా డీజిల్ కార్ల అభివృద్ధిపై దృష్టి సారించింది.

honda brio diesel readying diwali launch

గడచిన ఏడాది చివర్లో హోండా మోటార్స్ అభివృద్ధి చేసిన ఓ డీజిల్ ఇంజన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. రాబోయే కాలంలో తమ కార్లలో ఈ డీజిల్ ఇంజన్‌‌ను ఉపయోగించనున్నామని, తొలుతగా తాము అందిస్తున్న ప్రీమియం సెడాన్ హోండా సివిక్‌లో డీజిల్ వేరియంట్‌ను ఆఫర్ చేస్తామని కంపెనీ పేర్కొంది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే.. వీలైనంత త్వరగా హోండా డీజిల్ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

హోండా తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన బుజ్జికారు హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు మార్కెట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హోండా బ్రయో డీజిల్ వేరియంట్ కారును హోండా భారతీయ రోడ్లపై టెస్ట్ రన్ కూడా నిర్వహిస్తోందని ఇంటర్నెట్‌లో పలు స్పై షాట్‌లు (రహస్య చిత్రాలు) కూడా హల్ చల్ చేస్తున్నాయి.

కంపెనీ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. "వాస్తవానికి కంపెనీ తొలుత డీజిల్ కార్లను 2013 నాటికి ఇండియాలో ప్రవేశపెట్టాలని భావించింది. అయితే, పెట్రోల్ ధరలు భారీగా పెరడటం, డీజిల్ కార్లకు డిమాండ్ జోరుగా ఉండటంతో హోండా బ్రయో డీజిల్ వేరియంట్‌ను విడుదలను వేగవంతం చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. బహుశా ఈ ఏడాది దీపావళి నాటికి హోండా బ్రయో డీజిల్ కారు మార్కెట్లోకి వచ్చే ఆస్కారం ఉంది".

హోండా గతంలో ఆవిష్కరించిన 1.6 లీటర్ ఐ-డిటెక్ టర్బో డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 170 కేజీలు మాత్రమే బరువు ఉండే ఈ ఇంజన్ ఈ శ్రేణిలో అత్యంత తేలికైనది. దీన్ని 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయవచ్చు. మరి ఇదే ఇంజన్‌ను హోండా బ్రయో డీజిల్‌లో ఉపయోగిస్తారా.. లేదా తక్కువ సీసీ కలిగిన ఇంజన్‌ను ఉపయోగించనున్నారా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది.

English summary
Honda has been developing a diesel engine and this is the right time to fit it into its cars. Petrol price has touched an all-time high and the carmaker is advancing the launch of its Brio diesel small car - the first car to be powered by a diesel engine from Honda's Earth Dreams Series of engines.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu