Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

సిఎన్‌జి వెర్షన్ సిటీ సెడాన్‌ను విడుదల చేసిన హోండా

Written by:
Published: Tuesday, October 23, 2012, 17:13 [IST]

హోండా కార్స్ ఇండియా నుంచి దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీలో కంపెనీ ఓ సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నట్లు గడచిన ఆగస్ట్ నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇది వరకు చెప్పుకున్నట్లు గానే, హోండా కార్స్ తమ సిటీ సెడాన్‌లో ఇప్పుడు ఓ సిఎన్‌జి వెర్షన్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత మార్కెట్లో సిఎన్‌జి వెర్షన్ హోండా సిటీ ధర రూ.9.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


సిఎన్‌జి కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఈ హోండా సిటీని ప్రత్యేకంగా మోడిఫై చేసింది. హోండా ఆఫర్ చేస్తున్న ఈ సిఎన్‌జి కిట్ ధర రూ.50,300 లుగా ఉంది. నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ఆసక్తి చూపుతుండటం, దీనికి తోడు ఇప్పుడు ప్రధాన మెట్రో నగరాల్లో సిఎన్‌జి లభ్యత కూడా పెరుగుతుండటంతో కంపెనీ ఈ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

సిఎన్‌జి కిట్‌ను అమర్చేందుకు మోడిఫై చేసిన ఈ కొత్త హోండా సిటీ తిరుగులేని పెర్ఫామెన్స్‌ను, సాటిలేని మైలేజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. మోడిఫై చేస్న హోండా సిటీ కోసం సిఎన్‌జి కిట్‌లను సరఫరా చేసేందుకు గాను రోహన్ బిఆర్‌సిని హోండా కార్స్ తమ అధీకృత డీలర్‌గా నియమించుకుంది. ఈ కొత్త హోండా సిటీ 2 ఏళ్ల స్టాండర్డ్ వారంటీతో లభిస్తుంది. కొత్త హోండా సిటీలో సిఎన్‌జి కిట్‌ను ఫిట్ చేయడానికి గాను ఇందులో మెరుగుపరచబడిన 1.5 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. అలాగే సస్పెన్షన్‌ను కూడా మెరుగుపరచారు. హోండా సిటీ సిఎన్‌జి కూడా పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే మంచి డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

English summary
Honda Cars India Limited has launched the new modified Honda City which is compatible with CNG bi-fuel. There is a constant rise in consumers who are looking out for an alternative fuel vehicle with unmatched performance.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu