హోండా ఇండియన్ వెబ్‌సైట్‌లో అమేజ్ టీజర్ విడుదల

Written by:
 

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నుంచి డీజిల్ కారు కోసం ఎదురు చూస్తున్న కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్. హోండా అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ హోండా బ్రయో ఫ్లాట్‌ఫామ్‌ ఆధారంగా చేసుకొని కంపెనీ తయారు చేసిన హోండా అమేజ్ సెడాన్‌ను కొత్త సంవత్సరం కానుకగా కొనుగోలుదారులకు ఆఫర్ చేయనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదలైన హోండా బ్రయో అమేజ్ సెడాన్, అక్కడి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది.

ఇండియన్ మార్కెట్లో అమేజ్ సెడాన్ విడుదలకు సంబంధించి హోండా ఇప్పటికే తమ అధికారి వెబ్‌సైట్‌లో ఓ టీజర్‌ను విడుదల చేసింది. హోండా మొదటి డీజిల్ కారు గురించి మీ అభిప్రాయం ఏంటి? అనే థీమ్‌తో కంపెనీ తమ తొలి డీజిల్ సెడాన్ ఓ మైక్రో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. హోండా అమేజ్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసిన హోండా బ్రయో సెడాన్ (హోండా అమేజ్) ఎస్ ఎమ్‌టి, ఎస్ ఏటి, వి ఎమ్‌టి, వి ఏటి అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది.

పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, 16-వాల్వ్ పెట్రలో ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 90 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసింది. పెట్రోల్ వెర్షన్ అమేజ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడా లభ్యం కానుంది. డీజిల్ వెర్షన్ అమేజ్‌లో, ఎర్త్ డ్రీమ్స్ సంస్థతో కలిసి హోండా అభివృద్ధి చేసిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 హెచ్‌పిల శక్తిని, 210 ఎన్‌మ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ హోండా అమేజ్ లీటరుకు సుమారు 18-20 కి.మీ. మైలేజీని, డీజిల్ వెర్షన్ అమేజ్ లీటరుకు సుమారు 22-24 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది.

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

హోండా అమేజ్ సెడాన్

English summary
Honda India has already started marketing its future best seller- the Honda Amaze compact sedan by launching a special website. The Honda Amaze is expected to be a sure shot winner for the Japanese carmaker once it launches it later in 2013.
Share Your Comments

Please read our comments policy before posting

మీ వ్యాఖ్య రాయండి

More Headlines

Latest Photos

Latest Videos

New Launches