Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

జోరుమీదున్న కొత్త ఐ20, ఇయాన్, వెర్నా కార్లు

Posted by:
Updated: Friday, July 6, 2012, 15:20 [IST]

దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవల్ కారు హ్యుందాయ్ ఇయాన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హ్యుందాయ్ ఇయాన్ కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతున్నప్పటకీ, దీని స్టయిలిష్ లుక్, ఈ సెగ్మెంట్లో సాటిలేని పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్ వంటి అంశాల కారణంగా కొనుగోలుదారులు ఈ మోడల్‌పై మక్కువ చూపుతున్నారు.

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) సర్టిఫై చేసిన దాని ప్రకారం, భారత రోడ్ కండిషన్‌పై హ్యుందాయ్ ఇయాన్ లీటరు పెట్రోల్‌కు 21.1 కి.మీ. మైలేజీనిస్తుంది. హ్యుందాయ్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న కారు శాంత్రో అమ్మకాలను సైతం హ్యుందాయ్ ఇయాన్ అధిగమించేసింది. గడచిన జనవరి నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 6550 యూనిట్ల ఇయాన్ కార్లను విక్రయించింది. ఇదే సమయంలో కేవలం 3691 శాంత్రో కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.


హ్యుందాయ్ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త ఐజెన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కూడా కంపెనీ అమ్మకాల వృద్ధికి తోడ్పడింది. అలాగే ఫ్లూయిడిక్ వెర్నా సెడాన్, ఐ10 హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు కూడా ఎక్కువ అమ్ముడుపోయాయి.

మొత్తమ్మీద చూస్తే గడచిన జూన్ నెలలో హ్యుందాయ్ అమ్మకాలు 3.5 శాతం మేర వృద్ధి చెందాయి. ఈ సమయంలో కంపెనీ మొత్తం 54,354 యూనిట్లను విక్రయించింది. జూన్ 2011లో ఈ సంఖ్య 52,521గా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. హ్యుందాయ్ భారత మార్కెట్లో అందిస్తున్న మోడల్ వారీ అమ్మకాలు (జూన్ 2012 సేల్స్) ఈ విధంగా ఉన్నాయి:

* హ్యుందాయ్ ఇయాన్ - 6550 యూనిట్లు
* హ్యుందాయ్ శాంత్రో - 3691 యూనిట్లు
* హ్యుందాయ్ ఐ10 - 6177 యూనిట్లు
* హ్యుందాయ్ ఐ20 - 7676 యూనిట్లు
* హ్యుందాయ్ అసెంట్ - 301 యూనిట్లు
* హ్యుందాయ్ వెర్నా - 5929 యూనిట్లు
* హ్యుందాయ్ సొనాటా - 39 యూనిట్లు
* హ్యుందాయ్ శాంటాఫే- 87 యూనిట్లు

హ్యుందాయ్ ఇయాన్ ఫీచర్లు:

Story first published:  Friday, July 6, 2012, 15:17 [IST]
English summary
Hyundai Motors India, The country's second largest carmaker and the largest passenger car exporter registered aggregate sales of 54,354 units (52,521 units) in June, up 3.5 % from the same month last year. Domestic sales were up 0.2% at 30,450 units against 30.402 units last year. Exports stood at 23,904 units against 22,119 units, up 8.1%.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu