మోటార్ వాహన కవరేజ్‌లో మార్పులు చేయనున్న బీమా కంపెనీలు

Written by:
Published: Friday, December 21, 2012, 16:46 [IST]
 

మోటార్ వాహన కవరేజ్‌లో మార్పులు చేయనున్న బీమా కంపెనీలు

వాహన ఇన్సూరెన్స్ విషయంలో మోసాలు అధికమవుతున్న నేపథ్యంలో, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఓ కొత్త ప్రతిపాదనతో ముందుకు రానున్నాయి. ఇందులో భాగంగా, వాహన యజమానికి కాకుండా వారి స్నేహితులు లేదా ఇతరుల కారు నడుపుతుండగా ప్రమాదం జరిగినట్లయితే, క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. అంతేకాకుండా, మీ కుటుబంలో ఎంత మంది మీ వాహనాన్ని ఉపయోగిస్తారనే అంశాన్ని బట్టి కూడా మీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం‌లు పెరిగిపోయే ఆస్కారం కూడా ఉంది.

మోటార్ వాహన పాలసీని కొనుగోలు చేసే సమయంలో, సదరు పాలసీలో ఎవరెవరు వాహనం నడుపుతారో పేర్కొనాల్సి ఉంటుంది. సదరు లిస్టులో ఉన్న వారు కారు నడుపుతుండగా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే క్లెయిమ్ వర్తిస్తుంది. అలాకాకుండా, లిస్టులో లేనివారు వాహనం నడుపుతుండగా ప్రమాదం సంభవిస్తే, క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంది.

ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ప్రాఫిటబిలిటీని పెంచుకునేందుకు గాను ఈ కొత్త ప్రతిపాదను తీసుకువచ్చాయి. త్వరలోనే ఈ ప్రతిపాదనను బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డిఏ) ముందుచే ఆస్కారం ఉంది. థర్డ్ పార్టీ క్లెయిమ్‌లలో మోసాలు తగ్గించేందుకు ఇదొక్కటే మార్గమని బీమా కంపెనీలు భావిస్తున్నాయి.

English summary

Insurance Companies To Reject Claims If Friends Drive Car | మోటార్ వాహన కవరేజ్‌లో మార్పులు చేయనున్న బీమా కంపెనీలు

General insurance companies hav eproposed changes in rules pertaining to accident insurance claims. These changes will will allow them to reject claims in case the accident is caused when your friends or others are driving your car.
మీ వ్యాఖ్య రాయండి