ఓరగడంలో డెమ్లర్ ప్లాంట్‌ను ప్రారంభించిన జయలలిత

Posted by:

ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మాతృ సంస్థ డైమ్లర్‌ ఏజికు చెందిన వాణిజ్యా వాహనాల తయారీ కంపెనీ డైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డిఐసివి) తమిళనాడులోని చెన్నైకు సమీపంలో ఓరగడం వద్ద ఏర్పాటు చేసిన ఓ కొత్త ట్రక్కుల తయారీ ప్లాంటును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేతుల ప్రారంభించింది.

మొత్తం 400 ఏకరాల విస్తీర్ణంలో రూ.4,400 కోట్ల పెట్టుబడితో ఈ కొత్త ట్రక్కుల తయారీ ప్లాంట్‌ను నిర్మించామని డైమ్లర్‌ పేర్కొంది. ఈ ప్లాంట్‌లో 7 టన్నుల నుండి 49 టన్నుల వరకూ సామర్థ్యం కలిగిన విభిన్న వాణిజ్య వాహనాలను డైమ్లర్‌ ఉత్పత్తి చేయనుంది. ఇదే ప్లాంటులో మెర్సిడెస్ బెంజ్ కార్లను కూడా అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ ప్లాంటు ప్రారంభ దశలో భాగంగా తొలత వార్షికంగా 36,000 యూనిట్ల ట్రక్కులను ఉత్పత్తి చేయనుంది. తర్వాతి దశలో దీనిని సాలీనా 70,000 యూనిట్లకు పెంచనున్నారు. వచ్చే సెప్టెంబర్ 'భారత్ బెంజ్' ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ ప్లాంటులో తయారు చేసిన వాణిజ్య వాహనాలను ఆసియా, ఆఫ్రికా వంటి దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేయనుంది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
The Tamil Nadu Chief Minister, Ms J. Jayalalitha has inaugurated Daimler India Commercial Vehicles plant at Oragadam, near Chennai. The German company expects to roll out BharatBenz heavy duty trucks from this plant by September.
Please Wait while comments are loading...

Latest Photos