Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

కెన్యా మార్కెట్లోకి ప్రవేశించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500

Posted by:
Published: Friday, July 6, 2012, 18:36 [IST]

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' కొత్త రూట్ పట్టింది. ఇటీవలే ఆఫ్రికన్ మార్కెట్లోకి ప్రవేశించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇప్పుడు తాజాగా కెన్యా మార్కెట్లోకి ప్రవేశించింది. ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న గ్లోబల్ రేంజ్ ఉత్పత్తులను (పికప్‌లతో సహా) కెన్యా మార్కెట్లో విడుదల చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.

ఇందులో మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ, స్కార్పియో ఎస్‌యూవీ, పికప్ రేంజ్ ట్రక్స్, జెనియో పికప్, మ్యాక్సిమో మినీ ట్రక్‌లు ఉన్నాయని మహీంద్రా వెల్లడించింది. కెన్యా మార్కెట్లో కార్లను విక్రయించేందుకు సింబా కార్పోరేషన్‌ను తమ ఏకైక డీలర్‌గా నియమించుకున్నామని కంపె తెలిపింది.


మహీంద్రా ఎక్స్‌యూవీ500 విషయానికి వస్తే.. స్టయిల్, సేఫ్టీ, కంఫర్ట్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీల కలయితో దీనిని రూపొందించారు. పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ కోసం శక్తివంతమన ఇంజన్‌ను ఇందులో అమర్చారు. ఇది టూ-వీల్ డ్రైవ్, ఫోర్-డ్రైవ్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. వరల్డ్ క్లాస్ ఫీచర్లతో రూపొందించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డబ్ల్యూ6, డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్), డబ్ల్యూ8 (ఫోర్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది.

అసలు మహీంద్రా ఎక్స్‌యూవీ500ని ఎందుకు కొనాలి..?

ఇందులో అమర్చిన 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ 140 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 33 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఇందులో ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.

English summary
Mahindra & Mahindra has launched its international range of utility vehicles and pick-ups for the Kenyan market. This included its award winning XUV500 SUV, the Scorpio SUV and Pick Up range, the Genio Pick-Up and the Maxximo mini-truck.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu