Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

కాంపాక్ట్ ఎస్‌యూవీ క్వాంటోను విడుదల చేసిన మహీంద్రా

Posted by:
Published: Friday, September 21, 2012, 11:19 [IST]

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా క్వాంటో (మినీ జైలో)ను కంపెనీ గురువారం (సెప్టెంబర్ 20, 2012) నాడు మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో కెల్లా సరసమైన ధర, సలక్షణమైన ఫీచర్లో కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీర్చిందిద్దింది. కేవలం రూ.5.82 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ మహీంద్రా క్వాంటోను అందిస్తోంది. ఎమ్ అండ్ ఎమ్ అందిస్తున్న పాపులర్ ఎమ్‌యూవీ మహీంద్రా జైలో ఆధారంగా చేసుకొని కంపెనీ క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేసింది.

mahindra mahindra launches its compact suv quanto

ఇటు సిటీ డ్రైవ్‌కు అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్లకు అనుగుణంగా తీర్చిదిద్దిన మహీంద్రా క్వాంటో ఎస్‌యూవీ ఇకపై మహీంద్రా అండ్ మహీంద్రాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలువనుంది. మహీంద్రా క్వాంటోలో ఉపయోగించిన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే మహీంద్రా క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. మహీంద్రా క్వాంటో‌ను ఫుల్ ట్యాంక్ చేయిస్తే సుమారు 900 కిలోమీటర్లు ఎలాంటి చికాకులు లేకుండా ప్రయాణించవచ్చు.

మహీంద్రా క్వాంటో మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది. సి* గా పిలిచే టాప్ ఎండ్ వేరియంట్ మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్క్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. భారత మార్కెట్వో మహీంద్రా క్వాంటో ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

* మహీంద్రా క్వాంటో సి2 - రూ.5.82 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి4 - రూ.6.35 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి6 - రూ.6.86 లక్షలు
* మహీంద్రా క్వాంటో సి8 - రూ.7.36 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)

English summary
Mahindra has launched its first compact SUV, the Quanto with a starting price of Rs.5.82 Lakhs. The Quanto, which was previously called as the mini Xylo carries forward much of the design elements from the car that it is based on.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu