Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 ఫోటోలు లీక్

Posted by:
Published: Tuesday, September 18, 2012, 14:22 [IST]

మారుతి సుజుకి నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త ఆల్టో 800, ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో హాట్ ట్రెండ్‌గా మారింది. కొత్త స్విఫ్ట్, ఎర్టిగాల సక్సెస్ తర్వాత మరోసారి మారుతి సుజుకి ఇండియాకు సక్సెస్ తెచ్చిపెట్టేందు ఈ కొత్త కారు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి ఏ-స్టార్, పాత వెర్షన్ ఆల్టోల కలయికతో రూపొందించిన సరికొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కారు ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండనుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కొత్త ఆల్టో 800 స్పై చిత్రాలు హాట్ సెర్చ్‌గా మారాయి. ఈ క్రింది ఫోటో ఫీచర్‌లో కొత్త ఆల్టో ఫోటోలను గమనించవచ్చు. కొత్త ఆల్టో 800 చూడటానికి చిన్న కారు అయినప్పటికీ, మంచి ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండనుంది. ఇందులో ఉపయోగించిన సరికొత్త 800సీసీ ఇంజన్ ఇదివరకటి వెర్షన్ కన్నా మెరుగైన పనితీరును కనబరచనుంది. అంతేకాకుండా, ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 800 కారు కన్నా మంచి మైలేజ్‌ను కూడా ఇవ్వనుంది.

కొత్త మారుతి ఆల్టో 800 - ఫ్రంట్ డిజైన్

కొత్త ఆల్టో 800లో పెద్ద ఎయిర్ డ్యామ్, సింగిల్ లైన్ గ్రిల్‌, గ్రిల్ ఫ్రంట్ బంపర్‌ను కవర్ చేస్తూ ఫిక్స్ చేసిన సుజుకి లోగో, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్ వంటి మార్పులు చేర్పులను గమనించవచ్చు. ఇది చూడటానికి కాస్త మారుతి సుజుకి ఏ-స్టార్ డిజైన్‌లా అనిపిస్తుంది.

కొత్త మారుతి ఆల్టో 800 - రియర్ డిజైన్

మారుతి సుజుకి విడుదల చేయనున్న ఈ కొత్త ఆల్టో 800 రియర్ డిజైన్‌ను గమనిస్తే.. ఇందులో పెద్ద బ్రేక్ లైట్స్, పార్కింగ్ లైట్స్, సిగ్నల్ లైట్స్‌తో కూడిన టెయిల్ ల్యాంప్స్‌ ప్రధాణ ఆకర్షణగా నిలువనున్నాయి. ఇందులో వెనుకవైపు అమర్చిన వార్నింగ్ ల్యాంప్ మరొక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

కొత్త మారుతి ఆల్టో 800 - ఇంటీరియర్స్

నాణ్యమైన ప్లాస్టిక్‌తో చేయబడిన డ్యాష్‌బోర్డ్, మంచి లెగ్ రూమ్, సెంటర్ కన్సోల్‌పై ఏర్పాటు చేసిన పవర్ విండో స్విచ్‌లు (బహుశా టాప్ ఎండ్ వేరియంట్‌లో ముందు రెండు డోర్లకు మాత్రమే), పెద్ద ఏసి వెంట్స్, డ్యూయెల్ టోన్ సీట్లను ఇందులో గమనించవచ్చు.

కొత్త మారుతి ఆల్టో 800 - ఎయిర్‌బ్యాగ్స్

కొత్త ఆల్టో 800 చెప్పుకోదగిన మరొక ప్రత్యేకమైన ఫీచర్ ఎయిర్‌బ్యాగ్. స్టీరింగ్ వీల్‌లో అమర్చిన ఎయిర్‌బ్యాగ్ అత్యవసర సమయాల్లో డ్రైవర్‌కు రక్షణకవచంలా పనిచేస్తుంది. మారుతి సుజుకి అందిస్తున్న ఎంట్రీ లెవల్ కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ను వాడటం ఇదే మొదటిసారి.

కొత్త మారుతి ఆల్టో 800 - సిఎన్‌జి వెర్షన్

కొత్త మారుతి సుజుకి ఆల్టో 800లో సిఎన్‌జి వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇందులో ఓ సిఎన్‌జి వెర్షన్‌ను కంపెనీ విడుదల చేయవచ్చని సమాచారం.

English summary
Maruti Suzuki's soon to be launched small car, the Alto 800 has been sighted and here are the images. Automobile Forum TeamBHP has posted images of the Alto 800 and the images indicate Maruti Suzuki will be launching a CNG variant along with petrol.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu