మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లలో బ్రేక్ సమస్యకు చెక్..!

Written by:
Published: Friday, September 14, 2012, 17:18 [IST]
 

మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లలో బ్రేక్ సమస్యకు చెక్..!

దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో బ్రేకింగ్ సమస్యలు తలెత్తుతున్నట్లు గతంలో స్విఫ్ట్ యజమానులు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే, రాను రాను ఈ ఫిర్యాదుల సంఖ్య అధికం కావడంతో పరిస్థితి తీవ్రం కాకముందే ఈ సమస్యను పరిష్కరించాలని కంపెనీ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇండియా చడి చప్పుడు కాకుండా ఫిర్యాదు చేసిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ యజమానులకు ప్రత్యేకంగా సమాచారం అందించి ఈ సమస్యను సరిచేస్తున్నట్లు సమాచారం. స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ మారుతి లక్కీ ఛార్మ్ కావడంతో, ఈ సమస్యను రీకాల్ దశ వరకూ తీసుకువెళ్లకుడదనే ఉద్దేశ్యంతో కంపెనీ సమస్యను సైలెంట్‌గా పరిష్కస్తున్నట్లు సమాచారం

స్విఫ్ట్ రీకాల్ అని ప్రకటించినట్లయితే, తమ బ్రాండ్‌పై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కంపెనీ ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొత్త స్విఫ్ట్ కారును తక్కువ వేగంతో నడిపినప్పుడు, అలాగే సగం క్లచ్ హోల్డ్ చేసి డ్రైవ్ చేసినప్పుడు బ్రేకింగ్‌లో సమస్యలు తలెత్తుతున్నట్లు స్విఫ్ట్ యజమానులు పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాహనాన్ని త్వరగా నియంత్రించేందు బ్రేక్‌ను అప్లయ్ చేయటంలో కష్టంగా ఉన్నట్లు ఫిర్యాదులు రావటం జరిగింది.

కొత్త స్విఫ్ట్‌లో బ్రేకింగ్ సమస్య గురించి రీకాల్‌ను ప్రకటిస్తూ మారుతి సుజుకి ఇండియా అధికారికంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ సమస్య గురించి ఫిర్యాదు చేసిన వినియోగదారులకు మాత్రం కంపెనీ ఉచితంగా ఈ సమస్యను పరిష్కరిస్తోంది. మరి మీ మారుతి సుజుకి స్విఫ్ట్‌లో ఈ బ్రేకింగ్ సమస్య ఉన్నట్లయితే, వెంటనే మీ సమీపంలో మారుతి డీలర్‌ను కానీ లేదా కంపెనీ అధీకృత సర్వీస్ సెంటర్‌ను కానీ సంప్రదించండి.

English summary

Maruti Silently Fixing Swift Brake Problem | మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లలో బ్రేక్ సమస్యకు చెక్..!

Several owners of the Maruti Suzuki Swift had reported a braking issue in their cars earlier this year. The leading Indian carmaker which had initially chosen to ignore their complaints is now reportedly rectifying the problem without recalling the Swift.
మీ వ్యాఖ్య రాయండి