మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ధరలు వెల్లడి

By Ravi

దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్ గతంలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కంపెనీ మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ ధరలను వెల్లడి చేసింది. దేశీయ విపణిలో రిట్జ్ ఆటోమేటిక్ ధర రూ. 6.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మారుతి సుజుకి డీలర్లు ఇప్పటికే ఆటోమేటిక్ రిట్జ్ కోసం రూ.50,000 అడ్వాన్స్‌తో బుకింగ్‌లను అంగీకరిస్తున్నారు. జనవరి 15, 2012 నుంచి ఈ ఆటోమేటిక్ రిట్జ్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

ఇది ఈ సెగ్మెంట్లోని బ్రయో ఆటోమేటిక్ (5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్), హ్యుందాయ్ ఐ10 ఆటోమేటిక్ (4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) కార్లకు పోటీగా నిలువనుంది. దేశీయ విపణిలో హోండా బ్రయో ఆటోమేటిక్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.74 లక్షల నుంచి రూ.5.99 లక్షల రేంజ్‌లో ఉండగా, హ్యుందాయ్ ఐ10 ఆటోమేటిక్ ధర రూ.6.16 లక్షలుగా ఉంది. మారుతి సుజుకి రిట్జ్ ఇప్పటి వరకూ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది.

కాగా.. కంపెనీ ఆఫర్ చేయనున్న ఆటోమేటిక్ వేరియంట్ రిట్జ్‌లో మారుతి సుజుకి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్లలో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌నే ఉపయోగించారు. ఇందులో అమర్చిన 1.2 లీటర్ కె12 పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 17.16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. డిజైర్ ఆటోమేటిక్ మాదిరిగానే రిట్జ్ ఆటోమేటిక్ కూడా కేవలం విఎక్స్ఐ (ఏబిఎస్) వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

వచ్చే నెలలో మారుతి సుజుకి విడుదల చేయనున్న రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ ధరలను వెల్లడి చేసింది. దేశీయ విపణిలో రిట్జ్ ఆటోమేటిక్ ధర రూ. 6.15 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

ఆటోమేటిక్ వేరియంట్ రిట్జ్‌లో మారుతి సుజుకి ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్లలో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌నే ఉపయోగించారు.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

ఇందులో అమర్చిన 1.2 లీటర్ కె12 పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 17.16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. డిజైర్ ఆటోమేటిక్ మాదిరిగానే రిట్జ్ ఆటోమేటిక్ కూడా కేవలం విఎక్స్ఐ (ఏబిఎస్) వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్

ఇది ఈ సెగ్మెంట్లోని బ్రయో ఆటోమేటిక్ (5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్), హ్యుందాయ్ ఐ10 ఆటోమేటిక్ (4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) కార్లకు పోటీగా నిలువనుంది. దేశీయ విపణిలో హోండా బ్రయో ఆటోమేటిక్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.74 లక్షల నుంచి రూ.5.99 లక్షల రేంజ్‌లో ఉండగా, హ్యుందాయ్ ఐ10 ఆటోమేటిక్ ధర రూ.6.16 లక్షలుగా ఉంది.

Most Read Articles

English summary
Maruti Suzuki has reveled the price details of the automatic variant of its popular Ritz hatchback. Maruti has priced the Ritz auto at Rs 6.15 lakh (ex-showroom, Delhi). The leading Indian carmaker has updated its website with details about the upcoming automatic Ritz variant. Deliveries will commence by January 15, 2013.
Story first published: Friday, December 28, 2012, 15:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X