Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఈ-క్లాస్ లలో స్పోర్ట్ ఎడిషన్‌లు విడుదల

Posted by:
Updated: Thursday, October 4, 2012, 16:54 [IST]

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా అందిస్తూన్న సి-క్లాస్, ఈ-క్లాస్ లగ్జరీ సెడాన్లలో రెండు సరికొత్త వేరియంట్లను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. స్పోర్ట్ ఎడిషన్ సి-క్లాస్ 220 సిడిఐ, ఈ-క్లాస్ 220 సిడిఐ మోడళ్లను మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టెర్, సీఈఓ పీటర్ హానెగ్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేస్‌ను దృష్టిలో ఉంచుకొని, స్పోర్టీ లుక్ అండ్ ఫీల్ కలిగిన బెంజ్ కార్లను కోరుకునే కస్టమర్ల కోసం ఈ కార్లను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.

స్పోర్టీ ఎడిషన్ మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఈ-క్లాస్ కార్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ స్పోర్ట్ - రూ. 29.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
* మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ స్పోర్ట్ - రూ. 39.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్‌లో మరింత స్పోర్టీ లుక్‌నిచ్చేలా జోడించిన ఏఎమ్‌జి బాడీ స్టయిలింగ్, 17-ఇంచ్ 5-ట్విన్ స్పోక్ లైట్-అల్లాయ్ వీల్స్, స్పోర్ట్ బ్యాడ్జ్‌తో కూడిన బ్లాక్ పెయింటెడ్ రూఫ్, హ్యాలోజెన్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ ఫీచర్లతో లభిస్తుంది. ఇది పోలార్ వైడ్ బాడీ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఇంకా సౌకర్యవంతమైన సీటింగ్, ఎలక్ట్రిక్ సీట్స్, థెర్మాటిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిడి-ప్లేయర్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో లభిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్‌లో ప్రి-సేఫ్, నెక్ ప్రో, టైర్ ప్రెజర్ లాస్ వార్నింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యా‌గ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్ఆర్), బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్ 7-జి ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడిన 4-సిలిండర్ 2143సీసీ ఇంజన్‌తో లభ్యమవుతుంది. ఇది గరిష్టంగా 170 హెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఎకో స్టార్ట్ స్టాప్ వంటి ఇంధనాన్ని ఆదా చేసే టెక్నాలజీ, అగిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాత ఫీచర్లు కూడా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్‌లో కూడా ఏఎమ్‌జి బాడీ స్టయిలింగ్‌ను గమనించవచ్చు. ఇందులో 18-ఇంచ్ 5 స్పోక్ లైట్-అల్లాయ్ వీల్స్, స్పోర్ట్ బ్యాడ్జ్‌తో కూడిన బ్లాక్ పెయింటెడ్ రూఫ్, హ్యాలోజెన్ ల్యాంప్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఇది కూడా పోలార్ వైడ్ బాడీ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ-క్లాస్ స్పోర్ట్ వేరియంట్‌లో ఉపయోగించిన డైరెక్ట్ కంట్రోల్ సస్పెన్షన్ స్మూత్ రైడ్ క్వాలిటీని ఆఫర్ చేస్తుంది. లగ్జరీ ఇంటీరియర్స్, ప్రీమియం లెథర్ సీటింగ్, ఎలక్ట్రిక్ సీట్స్, థెర్మాటిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిడి-ప్లేయర్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో లభిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్‌

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్‌లో ప్రి-సేఫ్, నెక్ ప్రో, అటెన్షన్ అసిస్ట్, టైర్ ప్రెజర్ లాస్ వార్నింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యా‌గ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్ఆర్), బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్ 7-జి ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడిన 4-సిలిండర్ 2143సీసీ ఇంజన్‌తో లభ్యమవుతుంది. ఇది గరిష్టంగా 170 హెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఎకో స్టార్ట్ స్టాప్ వంటి ఇంధనాన్ని ఆదా చేసే టెక్నాలజీ, అడ్వాన్స్డ్ పార్కింగ్ గైడెన్స్ వంటి అధునాత ఫీచర్లు కూడా ఉన్నాయి.


మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్:

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్‌లో మరింత స్పోర్టీ లుక్‌నిచ్చేలా జోడించిన ఏఎమ్‌జి బాడీ స్టయిలింగ్, 17-ఇంచ్ 5-ట్విన్ స్పోక్ లైట్-అల్లాయ్ వీల్స్, స్పోర్ట్ బ్యాడ్జ్‌తో కూడిన బ్లాక్ పెయింటెడ్ రూఫ్, హ్యాలోజెన్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్ ఫీచర్లతో లభిస్తుంది. ఇది పోలార్ వైడ్ బాడీ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఇంకా సౌకర్యవంతమైన సీటింగ్, ఎలక్ట్రిక్ సీట్స్, థెర్మాటిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిడి-ప్లేయర్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో లభిస్తుంది.

ఇంకా ఇందులో, ప్రి-సేఫ్, నెక్ ప్రో, టైర్ ప్రెజర్ లాస్ వార్నింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యా‌గ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్ఆర్), బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. సి-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్ 7-జి ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడిన 4-సిలిండర్ 2143సీసీ ఇంజన్‌తో లభ్యమవుతుంది. ఇది గరిష్టంగా 170 హెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఎకో స్టార్ట్ స్టాప్ వంటి ఇంధనాన్ని ఆదా చేసే టెక్నాలజీ, అగిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాత ఫీచర్లు కూడా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్:
మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్‌లో కూడా ఏఎమ్‌జి బాడీ స్టయిలింగ్‌ను గమనించవచ్చు. ఇందులో 18-ఇంచ్ 5 స్పోక్ లైట్-అల్లాయ్ వీల్స్, స్పోర్ట్ బ్యాడ్జ్‌తో కూడిన బ్లాక్ పెయింటెడ్ రూఫ్, హ్యాలోజెన్ ల్యాంప్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. ఇది కూడా పోలార్ వైడ్ బాడీ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ-క్లాస్ స్పోర్ట్ వేరియంట్‌లో ఉపయోగించిన డైరెక్ట్ కంట్రోల్ సస్పెన్షన్ స్మూత్ రైడ్ క్వాలిటీని ఆఫర్ చేస్తుంది.

లగ్జరీ ఇంటీరియర్స్, ప్రీమియం లెథర్ సీటింగ్, ఎలక్ట్రిక్ సీట్స్, థెర్మాటిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సిడి-ప్లేయర్, యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ వంటి కంఫర్ట్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో కూడా ప్రి-సేఫ్, నెక్ ప్రో, అటెన్షన్ అసిస్ట్, టైర్ ప్రెజర్ లాస్ వార్నింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యా‌గ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్ఆర్), బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ-క్లాస్ స్పోర్ట్ ఎడిషన్ 7-జి ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడిన 4-సిలిండర్ 2143సీసీ ఇంజన్‌తో లభ్యమవుతుంది. ఇది గరిష్టంగా 170 హెచ్‌పిల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఎకో స్టార్ట్ స్టాప్ వంటి ఇంధనాన్ని ఆదా చేసే టెక్నాలజీ, అడ్వాన్స్డ్ పార్కింగ్ గైడెన్స్ వంటి అధునాత ఫీచర్లు కూడా ఉన్నాయి.

Story first published:  Thursday, October 4, 2012, 16:51 [IST]
English summary
Mercedes-Benz India today launched a Sport Edition of its flagship sedans the C-Class and the E-Class. The Sport Edition of the C-Class 220 CDI and the E-Class 220 CDI Sport Edition was launched by Mr. Peter Honegg, Managing Director & CEO, Mercedes-Benz India and Mr. Debashis Mitra, Director, Sales & Marketing, Mercedes-Benz India. The aggressive design language of Mercedes-Benz which is evident across the product lines is embodied in the Sport Edition of the C-Class and the E-Class both of which are pillars of Mercedes-Benz India’s product portfolio, and has been recognized for their aggressive looks.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu