రేసింగ్ వీరుడు మైఖేల్ షుముఖర్‌ను కలుసుకోవాలనుకుంటున్నారా? ఇండియాలో ఇటీవల ప్రారంభమైన బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌కు అధికారిక ఆటోమొబైల్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ సరికొత్త ఫెస్టివల్ క్యాంపైన్‌ను ప్రారంభించింది.
సెప్టెంబర్ 1, 2012 నుంచి ప్రారంభమైన ఈ క్యాంపైన్ అక్టోబర్ 15, 2012 వరకూ కొనసాగుతుంది. ఈ క్యాంపైన్‌లో భాగంగా, త్రీ పాయింటెడ్ స్టార్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా రేసింగ్ వరల్డ్ స్టార్ మైఖేల్ షుముఖర్‌ను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
అంతేకాకుండా, అన్ని ఖర్చులు కంపెనీ భరించి ఫార్ములా వన్ రేస్‌ను ప్రత్యక్షంగా వీక్షించే సౌకర్యాన్ని కూడా ఆఫర్ చేస్తోంది. ఇంకా, ఈ క్యాంపైన్ సమయంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా షోరూమ్‌లను సందర్శించి, తమ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసే వారికి 2012 ఎయిర్‌టెల్ గ్రాండ్ ప్రి కోసం 100 గ్రాండ్ స్టాండ్ టికెట్లను కూడా కంపెనీ ఇవ్వనుంది.
ఈ రేస్‌కు సంబంధించిన టికెట్లను దేశవ్యాప్తంగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా షోరూమ్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. మెర్సిడెస్ బెంజ్ మర్చండైస్‌లు ఈ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయి. రేస్ వస్తువుల పట్ల ఆసక్తి కలిగిన వారు వీటిని కొనుగోలు చేయవచ్చు.





















