సెప్టెంబర్ నెలలో సందడి చేయనున్న సరికొత్త వాహనాలు

Written by:
Published: Monday, September 17, 2012, 10:56 [IST]
 
ఈ సెప్టెంబర్ నెల ఆటో ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి సరికొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెనో స్కాలా సెడాన్, యమహా రే స్కూటర్‌లు విడుదల కాగా.. మరిన్ని కొత్త కార్లు, మోటార్‌సైకిళ్లు ఈ నెలలో విడుదల కానున్నాయి. అవేంటి వాటి కథేంటో ఈ శీర్షికలో తెలుసుకుందాం రండి..!!

పండుగ సీజన్‌లో మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా కార్ కంపెనీలన్నీ కూడా తమ కొత్త ఇదే సీజన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. ఈ నెలలో మెర్సిడెస్ బెంజ్ చిన్న కారు బి-క్లాస్, మహీంద్రా చిన్న ఎస్‌యూవీ క్వాంటో, నిస్సాన్ తొలి ఎమ్‌పివి ఇవాలియా, టీవీఎస్ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ ఫినిక్స్, మారుతి సుజుకి కొత్త చిన్న కారు ఆల్టో 800 మోడళ్లు ఈ నెలలో సందడి చేయనున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ : సెప్టెంబర్ 18

లగ్జరీ స్మాల్ కార్ సెగ్మెంట్లో అగ్గి రాజేసేందుకు మెర్సిడెస్ బెంజ్ ఇండియా తీసువస్తున్న చిన్న కారు 'బి-క్లాస్' ఈనెల 18న మార్కెట్లో విడుదల కానుంది. మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ టూరర్‌గా పిలిచే ఈ చిన్న కారు సెడాన్ లాంటి సౌకర్యాన్ని, ఎమ్‌పివి లాంటి ఫ్లెక్సిబిలిటీని, ఎస్‌యూవీ లాంటి పవర్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది రెండు వేరియంట్లలో (బి 180, బి 180 స్పోర్ట్) లభ్యం కానుంది. ఇందులో ఉపయోగించిన 1.6 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టం 122 హెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా క్వాంటో : సెప్టెంబర్ 20

మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎమ్‌పివి జైలో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో' ఈనెల 20న మార్కెట్లోకి రానుంది. హ్యాచ్‌బ్యాక్ లాంటి స్టయిల్, ఎమ్‌పివి లాంటి స్పేస్, ఎస్‌యూవీ లాంటి పవర్‌తో దీనిని తీర్చిదిద్దారు. ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ 100 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో 7-సీటర్ ఆప్షన్‌ కూడా ఉండే అవకాశం ఉంది. దేశీయ విపణిలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.5-6 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

నిస్సాన్ ఇవాలియా : సెప్టెంబర్ 26

ఎమ్‌పివి సెగ్మెంట్లో టొయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, చెవర్లే తవేరా ఎమ్‌పివిల జోరుకు కళ్లెం వేసేందుకు నిస్సాన్ అభివృద్ధి చేసిన ఇవాలియా ఎమ్‌పివి ఈనెల 26న మార్కెట్లో విడుదల కానుంది. ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ గరిష్టంగా 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్)తో లభించే నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.

టీవీఎస్ ఫినిక్స్ : సెప్టెంబర్ 28

ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో హోండా షైన్, హీరో గ్లామర్, బజాజ్ డిస్కవర్ వంటి మోడళ్లను సవాల్ చేస్తూ, టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి రానున్న 125సీసీ బైక్ 'ఫినిక్స్' ఈనెల 28న మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ పండుగ సీజన్‌లోనే తమ కొత్త బైక్‌ను మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10.5 బిహెచ్‌పిల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

మారుతి సుజుకి కొత్త ఆల్టో 800

మారుతి సుజుకి అందిస్తున్న బెస్ట్ సెల్లింగ్ స్మాల్ కార్ ఆల్టో ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన చవక కారు సరికొత్త ఆల్టో 800 కూడా ఈనెలలో మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇది ఈనెల 15వ తేదీనే మార్కెట్లోకి రావచ్చని పుకార్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ, సమీప మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ దీపావళి సీజన్‌లో కొత్త మారుతి సుజుకి ఆల్టో 800 కార్లు మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

English summary

Most Anticipated Launches In September | సెప్టెంబర్ నెలలో సందడి చేయనున్న సరికొత్త వాహనాలు

The month of September heralds the arrival of the festive season in India and the the auto industry celebrates it by launching new products much to the delight of buyers. This year's festive season is crucial for the auto industry as both car sales and two wheeler sales are under pressure due to low consumer sentiment.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu

Latest Photos

Latest Videos

Free Newsletter

Sign up for daily auto updates

New Launches