Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

కొత్త ఫియట్ లీనియా, పుంటో: మరిన్ని ఫీచర్స్, మరిన్ని బెనిఫిట్స్

Posted by:
Updated: Monday, September 24, 2012, 12:34 [IST]

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ భారత మార్కెట్లో అందిస్తున్న లీనియా సెడాన్, పుంటో హ్యాచ్‌బ్యాక్‌లలో సరికొత్త వేరియంట్లను కంపెనీ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రెండు వేరియంట్లలో 'అబ్యల్యూట్' ఎడిషన్‌ను కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుత పండుగ సీజన్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఫియట్ ఇండియా ఈ రెండు కొత్త వేరియంట్లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ఈ కార్లను కొనుగోలు చేసే వారు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే ఫియట్ లీనియా సెడాన్‌పై రూ.78,000లు మరియు ఫియట్ పుంటో హ్యాచ్‍‌బ్యాక్‌పై రూ.67,000ల విలువైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

కొత్త వేరియంట్లలో కొత్తేమిటి..?
అబ్సల్యూట్ ఎడిషన్ ఫియట్ పుంటో, ఫియట్ లీనియా కార్లలో 3జి టాబ్లెట్, జిపిఎస్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ ఫంక్షనాలిటీ, రివర్స్ పార్కింగ్ కెమరా ఫీచర్లతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్ప్లాష్ గార్డ్స్, బ్రాండెడ్ మెటాలిక్ డోర్ సిల్స్, బ్రాండెడ్ క్యాబిన్ మ్యాట్స్, ఎలిగాంట్ బూట్ క్రోమ్ స్ట్రిప్‌తో కారుపై అబ్సల్యూట్ బ్రాండింగ్‌తో ఇవి లభిస్తాయి.

కొత్త ఫియట్ పుంటో, లీనియాలపై భారీ ప్రోత్సాహకాలు

పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఫియట్ ఇండియా అందిస్తున్న పుంటో, లీనియా మోడళ్లలో కంపెనీ ఆబ్సల్యూట్ ఎడిషన్ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టి సుమారు రూ.78,000 విలువైన ప్రోత్సాహకాలను కంపెనీ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

కొత్త ఫియట్ లీనియాలో ఫీచర్లు

అబ్సల్యూట్ ఎడిషన్ ఫియట్ లీనియా సెడాన్‌లో 3జి టాబ్లెట్, జిపిఎస్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ ఫంక్షనాలిటీ, రివర్స్ పార్కింగ్ కెమరా ఫీచర్లతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్రాండెడ్ మెటాలిక్ డోర్ సిల్స్, బ్రాండెడ్ క్యాబిన్ మ్యాట్స్, ఎలిగాంట్ బూట్ క్రోమ్ స్ట్రిప్‌తో కారుపై అబ్సల్యూట్ బ్రాండింగ్‌తో ఇవి లభిస్తాయి.

కొత్త ఫియట్ పుంటోలో లభించే ఫీచర్లు

అబ్సల్యూట్ ఎడిషన్ ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్‌లో 3జి టాబ్లెట్, జిపిఎస్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ ఫంక్షనాలిటీ ఫీచర్లతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్రాండెడ్ మెటాలిక్ డోర్ సిల్స్, బ్రాండెడ్ క్యాబిన్ మ్యాట్స్, స్ప్లాష్ గార్డ్స్, ఎలిగాంట్ బూట్ క్రోమ్ స్ట్రిప్‌తో కారుపై అబ్సల్యూట్ బ్రాండింగ్‌తో ఇవి లభిస్తాయి.

కొత్త లీనియాపై రూ.78,000 ల బెనిఫిట్స్

ప్రస్తుతం కొత్త ఆబ్సల్యూట్ ఎడిషన్ ఫియట్ లీనియా కొనుగోలుపై వినియోగదారులు సుమారు రూ.78,000ల విలువైన ప్రోత్సాహకాలను పొందవచ్చు.

కొత్త ఫియట్ పుంటోపై రూ.67,000ల బెనిఫిట్స్

ప్రస్తుతం కొత్త ఆబ్సల్యూట్ ఎడిషన్ ఫియట్ పుంటో కొనుగోలుపై వినియోగదారులు సుమారు రూ.67,000ల విలువైన ప్రోత్సాహకాలను పొందవచ్చు.


బెనిఫిట్స్ ఏంటి?
* ఆబ్సల్యూట్ ఎడిషన్ ఫీచర్లు
* ఎక్సేంజ్ బోనస్
* ఆకర్షనీయమైన ఇన్సూరెన్స్ ఆఫర్
* ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్

మరి ఫియట్ అందిస్తున్న ఈ ఆబ్సల్యూట్ ఆఫర్ ధరకు తగిన విలువను కలిగి ఉందా..? మరిన్ని ఫీచర్లు, ప్రయోజనాలతో కంపెనీ ఆఫర్ చేస్తున్న ఈ కొత్త వేరియంట్లు హిట్ అవుతాయో లేదో తెలియాలంటే, మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది మార్చి నాటికి టాటా మోటార్స్ నుంటి పూర్తిగా తమ సేల్స్ కార్యకలాపాలను వేరు చేసి, స్వతహాగా డీలర్లను నియమించుకునే ప్రక్రియను పూర్తి చేస్తామని ఫియట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్) రవి భాటియా వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి 80 ఎక్స్‌క్లూజివ్ ఫియట్ షోరూమ్‌లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, అలాగే, కొత్తగా 100 మంది సేల్స్ సిబ్బందిని నియమించుకోనున్నామని ఆయన చెప్పారు. సేల్స్ పరంగా టాటా మోటార్స్ నుంచి విడిపోయినప్పటికీ, కార్లు మరియు డీజిల్ ఇంజన్ల తయారీలో మాత్రం టాటాతో భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Story first published:  Friday, September 21, 2012, 11:15 [IST]
English summary
Fiat India has rolled out an Absolute Edition of the Punto and Linea. The company is looking woo customers during the festive season with varied accessory packages. Customers can now avail benefits upto INR 78,000 and INR 67,000 on the Fiat Linea and Fiat Punto respectively at no extra cost.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu