Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

మరో నెల రోజుల్లో మార్కెట్లోకి రానున్న టాటా సఫారీ స్టోర్మ్

Posted by:
Published: Thursday, May 31, 2012, 15:19 [IST]

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)లలో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'టాటా సఫారీ'లో ఓ సరికొత్త వెర్షన్ మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది జనవరి నెలలో న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఆవిష్కరించిన టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ మరో నెల రోజుల్లోగా మార్కెట్లో వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది.

టాటా సఫారీ స్టోర్మ్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాటా సఫారీ కన్నా పెద్దదిగా ఉండటమే కాకుండా, తేలికగా కూడా ఉంటుంది. స్టయిలిష్ లుక్, ఆకర్షనీయమైన ఫీచర్లతో రూపొందించిన టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఉపయోగించిన 2.2-లీటర్ 16-వాల్వ్ కామన్ రైల్ (డైకార్) ఇంజన్‌ 140 పిఎశ్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

new tata safari storme coming a monnth

సరికొత్త గ్రిల్, క్రోమ్ కోటింగ్ చేయబడిన ఎగ్జాస్ట్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఎన్నో మార్పులు కొత్త టాటా సఫారీ స్టోర్మ్ సొంతం. అంతేకాకుండా కొత్త టాటా సఫారీ స్ట్రోమ్‌ ఇంటీరియర్లలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, విలాసవంతమైన బీజ్ సీట్స్, సీట్ కలర్‌కి సరిపోయే విధంగా రూపొందించిన స్టీరింగ్ వీల్ లెథర్ కవర్, వుడ్ ఫినిష్డ్ డ్యాష్‌బోర్డ్ అండ్ డోర్ ట్రిమ్స్ వంటి మరోన్నో సదుపాయాలు కొత్త సఫారీ స్టోర్మ్ సొంతం.

బుల్లెట్-ఫ్రూఫ్ టాటా సఫారీ కారు గురించి తెలుసా..?

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా సంస్థల అధినేత రతన్ టాటా మరియు ఆయన వారసుడు సైరస్ మిస్త్రీలు సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్‌ ఎస్‌యూవీని తొలిసారిగా ఆవిష్కరించారు. టాటా మోటార్స్ ఇప్పటికే కొత్త సఫారీ స్టోర్మ్‌ను ఉత్పత్తి చేయటం కూడా ప్రారంభించింది. భారత మార్కెట్లో టాటా సఫారీ స్టోర్మ్ ధర రూ.9 లక్షల నుండి 12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

ఇండియన్ ఆర్మీ కోసం ఆయుధాలతో కూడిన టాటా సఫారీ

English summary
Tata Motors stylish SUV Safari Storme is expected to hit the Indian roads by the end of June or early July. The new Safari has an all-new styling and comes with a host of new features and specifications. The 4-wheel drive Safari Storme is powered by a 2.2-liter 16-valve common rail (DiCOR) engine, which generates 140 PS power and 320 Nm torque. This engine will be mated to a 5-speed manual transmission.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu