మహీంద్రా జైలో వర్సెస్ టొయోటా ఇన్నోవా: ఏది బెస్ట్?

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 18:02 [IST]
ఎమ్‌పివి సెగ్మెంట్లో రారాజుగా రాణిస్తున్న టొయోటా ఇన్నోవాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఇన్నోవాకు పోటీగా కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్రా కేవలం రూ.7.37 లక్షల ప్రారంభ ధరకే ఇన్నోను సవాల్ చేస్తూ కొత్త 2012 ఫేస్‌లిఫ్ట్ స్టయిలిష్ "మహీంద్రా జైలో"ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ధరలో ఏది బెస్ట్..?
ఇది ఇన్నోవా బేస్ వేరియంట్ కన్నా రూ.1.50 లక్షలు చవకైనది. టొయోటా ఇన్నోవా బేస్ వేరియంట్ ధర రూ.8.87 లక్షలుగా ఉంది. అలాగే, ఇన్నోవో జిఎక్స్ వేరియంట్ కన్నా జైలో ఈ8 వేరియంట్ రూ.1.15 లక్షలు, ఇన్నోవా విఎక్స్ వేరియంట్ కన్నా జైలో ఈ9 వేరియంట్ సుమారు రూ.3 లక్షలు చవకైనది. కాబట్టి ఇక్కడ ధర విషయంలో టొయోటా ఇన్నోవా కన్నా మహీంద్రా జైలో ఎన్నో రెట్లు మెరుగైనదని చెప్పవచ్చు

ఫీచర్లలో ఏది బెస్ట్..?
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇన్నోవాలో టొయోటా మరిన్ని ఫీచర్లను జోడించి, అత్యంత ఆకర్షనీయంగా తీర్చిదిద్ది ఇటీవలే 2012 వెర్షన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొత్త జైలోలో క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ కమాండ్ టెక్నాలజీ వంటి కొత్త ఫీచర్లను మహీంద్రా పరిచయం చేసింది. ఈ రెండు ఫీచర్లు టొయోటా ఇన్నోవాలో కనిపించవు. లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ విషయంలో ఇన్నోవా కన్నా కొత్త జైలో మరింత విశాలంగా ఉంటుంది.

పెర్ఫామెన్స్‌లో ఫీచర్లలో ఏది బెస్ట్..?
అలాగే, పెర్ఫామెన్స్ పరంగా చూసినట్లయితే, కొత్త జైలో టాప్-ఎండ్ వేరియంట్ ఈ9లో 2.2లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు (ఇదే ఇంజన్‌ను స్కార్పియోలో కూడా ఉపయోగించడం జరుగుతుంది), ఇది 120 బిహెచ్‌పిల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇన్నోవాలో ఉపయోగించే ఇంజన్ కన్నా 20 బిహెచ్‌పిల అధిక శక్తిని, 90 ఎన్ఎమ్‌ల అధిక టార్క్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి పెర్ఫామెన్స్‌లో టొయోటా ఇన్నోవాను కొత్త జైలో ఓవర్‌టేక్ చేసిందని చెప్పవచ్చు.

English summary
Mahindra Xylo facelift will directly compete with the 2012 Toyota Innova, which was launched at the 11th Delhi Auto Expo last month. Price-wise, the Xylo facelift starts at Rs. 7.37 lakh, which is Rs. 1.50 lakh cheaper than the Innova base variant that costs Rs. 8.87 lakh.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .