నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఎమ్‌పివి సెగ్మెంట్లో అగ్గి రాజేసేందుకు జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా సిద్ధం చేసిన ఇవాలియాను ఈనెల 26న మార్కెట్లో విడుదల కానుంది. నిస్సాన్ ఇండియా ఇప్పటికే, ఇవాలియాకు సంబంధించి మీడియా కోసం ఎక్స్‌క్లూజివ్ ప్రిప్వూ, టెస్ట్ డ్రైవ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండి, మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా జైలో, చెవర్లే తవేరా నియో3 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి విశాలమైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉండి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తుంది. ఇది తొలుతగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇందులో 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ కె9కె డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1900 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (గేర్ బాక్స్) కలిగిన నిస్సాన్ ఇవాలియా లీటర్ డీజిల్‌కు సుమారు 20 కి.మీ. మైలేజీనిస్తుంది.
నిస్సాన్ ఎవాలియా ఎమ్‌పివిలో ఉండే ఫీచర్లను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.
ఇవాలియా ఫ్రంట్ లుక్
* హీటర్‌తో కూడిన మ్యాన్యువల్ ఎయిర్ కండిషనర్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి వేరియంట్లలో వెనుక ప్యాసింజర్లకు సైతం ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్
* టాప్ ఎండ్ వేరియంట్ (ఎక్స్‌వి)లో రియర్ వ్యూ కెమెరా
* ఏఎమ్, ఎఫ్ఎమ్, సిడి సపోర్ట్‌తో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, 4 స్పీకర్లు
నిస్సాన్ ఇవాలియా మొత్తం బరువు 1426 కేజీలు. ఇది 4400 మి.మీ. పొడవును, 1695 మి.మీ. వెడల్పు, 1880 మి.మీ. ఎత్తును మరియు 180 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. నిస్సాన్ ఇవాలియాలో ఆరుగురు ప్రయాణికులు (డ్రైవర్ కాకుండా) హాయిగా ప్రయాణించవచ్చు. వెనుక వరుసలలో ఉండే రెండు సీట్లను పూర్తిగా మడిచినట్లయితే 2900 లీటర్ల వరకూ బూట్ స్పేస్ లభిస్తుంది.
ఇన్ని ప్రత్యేకమైన విశష్టమైన ఫీచర్లు కలిగిన నిస్సాన్ ఇవాలియా నాలుగు వేరియంట్లలో (ఎక్స్ఈ, ఎక్స్ఈ ప్లస్, ఎక్స్ఎల్, ఎక్స్‌వి) లభ్యమవుతుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. నిస్సాన్ ఇవాలియా సెప్టెంబర్ 26, 2012న మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల కానుంది. ధర, ఫీచర్లను పరిగణిలోకి తీసుకుంటే, ఎమ్‌పివి సెగ్మెంట్లో 'ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇవాలియా ఈజ్ బెస్ట్' అని చెప్పవచ్చు. మీరేమంటారు..?




































