ఇకపై ఇండియాలో అన్ని గ్లోబల్ మోడళ్లే: ఫోర్డ్ ఇండియా

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 16:11 [IST]
ప్రస్తుతం దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో గ్లోబల్ ట్రెండ్ నడుస్తోంది. కార్ కంపెనీలన్నీ దాదాపు గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న మోడళ్లనే ఇండియాన్ మార్కెట్లోనూ కొద్దిపాటి నామమాత్రపు మార్పులు చేర్పులు చేసి విడుదల చేసేస్తున్నాయి. ఫలితంగా ఇలాంటి కార్ కంపెనీలకు డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా ఎంతో మిగులు ఏర్పడినట్లు అవుతుంది.

ఈ వాస్తవాన్ని గ్రహించిన అమెరికన్ ఆటో దిగ్గడం ఫోర్డ్, భారత మార్కెట్లో ఇకపై గ్లోబల్ మోడళ్లనే ఉత్పత్తి చేస్తామని, ఇండియన్ స్పెసిఫిక్ మోడళ్లకు అంత ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఫోర్డ్ భారత్‌లో అందిస్తున్న కొత్త ఫియస్టా సెడాన్ గ్లోబల్ వేరియంట్. దీనికి ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇకపై అన్ని గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా డిజైన్ చేసే కార్లనే దేశీయ విపణిలోనూ విడుదల చేయాలని ఫోర్డ్ ఇండియా భావిస్తోంది. ఫోర్డ్ ఇండియా ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2012లో ఆవిష్కరించి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ కూడా గ్లోబల్ మోడలే. ఇదే మోడల్ ప్రపంచ మార్కెట్లలో కూడా లభ్యం కానుంది. త్వరలో ఇది దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల కానుంది.

ఇతర ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే ఈ విధాన్ని అనుసరిస్తున్నాయి. దేశీయ యుటిలిటీ వాహనాల దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారిగా గ్లోబల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఇటు భారతీయులను, అటు విదేశీయులను దృష్టిలో ఉంచుకొని ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కంపెనీ తాజాగా విడుదల చేసిన 2012 జైలోనూ కూడా గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకునే ఎమ్ అండ్ డిజైన్ చేసింది.

అలాగే, హ్యుందాయ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అత్యంత సక్సెస్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను అన్ని ఇండియన్ స్పెసిఫిక్ మోడళ్లకు వర్తింప చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మొత్తానికి ఇకపై ఇండియాలో ఎక్కువగా గ్లోబల్ స్పెసిఫిక్ వేరియంట్లే దర్శనమివ్వబోతున్నాయన్నమాట.
English summary
Ford Motors has so far been fairly successful in India as it has been able to design and build cars that are suitable to Indian conditions as well as buyers needs. Although the idea of catering to the customer's requirements is not being changed, Ford Motors has stated that it will no longer develop cars specifically for India. This means the Figo will be the last car that ford has developed only for India.
User Comments
fazaley 16 May 2012 02:21 pm
Dear Drivespark Editor, Could please give article about Premier SUV model details, specifications etc. Thank you.
[ మీ వ్యాఖ్య రాయండి ]