హైదరాబాద్: మేడ్ ఇన్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ప్రీమియర్ రియో' ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో కూడా లభ్యం కానుంది. ప్రీమియర్ ఆటోమొబైల్స్ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ రియోలో కంపెనీ ఇటీవలే ఓ కొత్త వెర్షన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫియట్ నుంచి పొందిన సరికొత్త 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ప్రీమియర్ రియోలో ఉపయోగించారు. ఇది లీటరు డీజిల్‌కు 19 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ వివరించింది.
కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీని తీర్చిదిద్దామని ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుందని సంస్థ సిఎమ్‌డి మైత్రేయ దోషి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మార్కెట్లో ప్రీమియర్ రియో ధర రూ. 7.07 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది.
మారుతి సుజుకి స్విఫ్ట్, ఫియట్ పుంటో, టాటా విస్టా కార్లలో ఉపయోగించే 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌నే ప్రీమియర్ రియోలో కూడా ఉపయోగించడం జరిగింది. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 183 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.
Full Details About Premier Rio SUV:
'ప్రీమియర్ రియో సిఆర్‌డిఐ4'గా పిలిచే ఈ డీజిల్ వెర్షన్ రియో నాలుగు రంగుల్లో (నలుపు, ఎరుపు, తెలుపు, సిల్వర్) లభిస్తుంది. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే (3970 మి.మీ.) ఈ ప్రీమియర్ రియోలో ఏబిఎస్, బీజ్ ఇంటీరియర్స్, రియర్ వైపర్ అండ్ డిఫాగ్గర్, వెనుక డోర్‌కు అమర్చిన స్పేర్ వీల్, పవర్ విండోస్ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది.





















