Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

సరికొత్త డీజిల్ రియోను విడుదల చేసిన ప్రీమియర్

Posted by:
Published: Thursday, August 2, 2012, 14:44 [IST]

ప్రీమియర్ ఆటోమొబైల్స్ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ రియోలో ఓ కొత్త వెర్షన్‌ను కంపెనీ తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. సరికొత్త డీజిల్ ఇంజన్‌తో కూడిన ప్రీమియర్ రియోను రూ.6.7 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్) కంపెనీ విడుదల చేసింది. ఫియట్ నుండి పొందిన 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను కొత్త డీజిల్ వెర్షన్ ప్రీమియర్ రియోలో ఉపయోగించామని కంపెనీ పేర్కొంది.

గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రీమియర్ ఈ సరికొత్త వెర్షన్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఆగస్టు 2, 2012 నుండి 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌తో కూడిన ప్రీమియర్ రియో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.


ప్రీమియర్ రియో డీజిల్ వెర్షన్ ఇప్పటికే ఇండియాలో అందుబాటులో ఉంది. అయితే, ఇది కేవల బిఎస్ 3 కాలుష్య నిబంధనలు మాత్రమే పాటిస్తుండటంతో ఈ వేరియంట్‌ కొన్ని మార్కెట్లకు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, ప్రీమియర్ రియోను మరిన్ని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను, బిఎస్ 4 కాలుష్య నిబంధనలు పాటించేలా ఫియట్ తీర్చిదిద్దిన 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించటం జరిగింది.

ఇదే ఇంజన్‌ను మారుతి సుజుకి స్విఫ్ట్, ఫియట్ పుంటో, టాటా విస్టా కార్లలో ఉపయోగిస్తున్నారు. ప్రీమియర్ రియోలో ఉపయోగించిన 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 183 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్లు) సిస్టమ్‌తో లభించే ప్రీమియర్ రియో డీజిల్ మెరుగైన మైలేజీని (19 కెఎమ్‌పిఎల్) ఆఫర్ చేస్తుంది.

Full Details About Premier Rio SUV:

'ప్రీమియర్ రియో సిఆర్‌డిఐ4'గా పిలిచే ఈ డీజిల్ వెర్షన్ రియో నాలుగు రంగుల్లో (నలుపు, ఎరుపు, తెలుపు, సిల్వర్) లభిస్తుంది. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే (3970 మి.మీ.) ఈ ప్రీమియర్ రియోలో ఏబిఎస్, బీజ్ ఇంటీరియర్స్, రియర్ వైపర్ అండ్ డిఫాగ్గర్, వెనుక డోర్‌కు అమర్చిన స్పేర్ వీల్, పవర్ విండోస్ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది.

English summary
Premier has launched the Rio compact SUV with a diesel engine sourced from Fiat. The Premier Rio with Fiat engine is now available in showrooms with a starting price of Rs.6.7 lakhs.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu