వేలానికి అరుదైన ఫెరారీ కారు: వెల రూ.35 కోట్లకు పైమాటే

By Ravi

పురాతన కార్లకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఫెరారీ కార్లంటే వేరే చెప్పక్కర్లేదు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నాటి ఫెరారీ కారు, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల జాబితాలోకి చేరిపోనుంది. 1960వ శతాబ్ధానికి చెందిన ఫెరారీ 250 జిటి ఎస్‌డబ్ల్యూబి బెర్లినెట్టా కంపీటీజియోన్ (Ferrari 250 GT SWB Berlinetta Competizione) కారు ప్రస్తుతం వేలానికి వచ్చింది. వచ్చే నెలలో ఈ కారును ప్రముఖ వేలం సంస్థ ఆర్ఎమ్ ఆక్షన్స్ ఈ కారును అమెరికాలో వేలం వేయనుంది.

వేలంలో ఈ 1960 ఫెరారీ 250 జిటి ఎస్‌డబ్ల్యూబి బెర్లినెట్టా కంపీటీజియోన్ కారు 40 లక్షల పౌండ్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ. 35 కోట్లు) పలకవచ్చని అంచనా. గడచిన సంవత్సరంలో ఇలాంటి ఓ కారునే వేలం వేస్తే అది 31 లక్షల పౌండ్లు (సుమారు రూ. 27 కోట్లు) వెల పలికింది. అప్పట్లో ఫెరారీ ఇలాంటి కార్లను కేవలం 74 మాత్రమే తయారు చేసింది. ఇందులో త్రీ లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా, 280 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. ఇది కేవలం ఆరు సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. గడచిన 52 ఏళ్లలో ఈ కారుకు కేవలం నలుగురు యజమానులు మాత్రమే మారారు.

Ferrari 250 GT SWB Berlinetta Competizione
Most Read Articles

English summary
A rare Ferrari 250 GT SWB Berlinetta Competizione went under the hammer. It Will be auctioned by RM Auctions in America on January 18. This classic car is expected to fetch up to £4 million in auction.
Story first published: Thursday, December 27, 2012, 20:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X