Thought for the day
Your page will load in ...
Close Ad X
Advertisement
English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
 
Share This Story

నిస్సాన్ సన్నీ క్లోన్‌తో రెనో స్కాలా; దీపావళికి విడుదల

Posted by:
Published: Friday, August 3, 2012, 18:48 [IST]

Renault India To Launch Scala Sedan By Diwali

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఫ్రెంచే కార్ మేకర్ అందిస్తున్న రెనో పల్స్ మాదిరిగానే, నిస్సాన్ సన్నీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఓ సెడాన్‌ను కంపెనీ తయారు చేస్తోంది. రెనో స్కాలా అనే పేరుతో దేశీయ విపణిలోకి రానున్న ఈ సెడాన్ దాదాపుగా నిస్సాన్ సన్నీ సెడాన్ మాదిరిగానే ఉండనుంది. ఇంజన్ పరంగా ఎలాంటి సాంకేతిక మార్పులు ఉండకోవచ్చని తెలుస్తోంది.

అయితే, ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో మాత్రం కొద్దిపాటి మార్పులు ఉండొచ్చని అంచనా. ముఖ్యంగా ఫ్రంట్ బంపర్, గ్రిల్, క్రోమ్ స్ట్రిప్స్, సరికొత్త అల్లాయ్ వీల్స్ వంటి ప్రధాన మార్పులు ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ 85 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్‌నే రెనో స్కాలా సెడాన్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే, రెనో ఇండియా తొలుత డీజిల్ వెర్షన్ స్కాలాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ప్రస్తుతానికి పెట్రోల్ వెర్షన్ రెనో స్కాలాను విడుదల చేసే విషయంపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకునేలా కనిపించడం లేదు. భారత మార్కెట్లో రెనో ఇండియా ప్రీమియం బ్రాండ్‌గా వ్యవహరించాలనుకుంటుంది కాబట్టి, రెనో స్కాలా సెడాన్ ధర విషయానికి వస్తే, ఇది నిస్సాన్ సన్నీ సెడాన్ కన్నా కాస్తంత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెనో స్కాలా సెడాన్ రెనో ఇండియా నుంచి వస్తున్న ఐదవ ఉత్పత్తి కావటం విశేషం.

నిస్సాన్-రెనో భాగస్వామ్యంలో చెన్నైలో నిర్వహించబడుతున్న ఫ్యాక్టరీలోనే రెనో స్కాలా సెడాన్‌ను కంపెనీ ఉత్పత్తి చేయనుంది. నిస్సాన్ సన్నీ సెడాన్ మాదిరిగానే రెనో స్కాలా కూడా ఇండియన్ మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రెనో ఇండియా పల్స్ హ్యాచ్‌బ్యాక్, ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్, ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్, ఎస్‌యూవీ డస్టర్ ఉత్పత్తులను అందిస్తోంది.

English summary
French carmaker Renault India is planing to bring new car by Diwali. It is expected that the new car would be a re-badged version of Nissan sunny and it will be called the Scala.
మీ వ్యాఖ్య రాయండి
Click here to type in Telugu