రెనో స్కాలా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ధరలు - సమీక్ష

Posted by:

గతంలో భారత మార్కెట్లోకి ఐదు మోడళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పిన ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా నేడు తమ ఐదవ ఉత్పత్తి 'రెనో స్కాలా' సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రీమియం ఏ3 సెగ్మెంట్లో విడుదలైన రెనో స్కాలా సెడాన్‌ను, ప్రత్యేకించి భారతీయ వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ డిజైన్ చేసింది.

రెనో స్కాలా పాపులర్ నిస్సాన్ సన్నీ సెడాన్ ఫ్లాట్‌ఫామ్‌‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసినప్పటికీ, ఇందులో రెనో డిజైన్ డిఎన్ఏను మనం స్పష్టంగా గమనించవచ్చు. రెనో స్కాలా సెడాన్ పవర్, కంఫర్ట్, కన్వీనెన్స్, స్టయిలింగ్, సేఫ్టీ, టెక్నాలజీ విషయాల్లోనే కాకుండా, ఈ సెగ్మెంట్లో ధర పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది.

* రెనో స్కాలా ముందు వైపు క్రోమ్ రేడియేటర్ గ్రిల్, స్మోక్ స్టయిల్డ్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్‌ ల్యాంప్స్‌తో ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

* రెనో స్కాలా వెనుక వైపు డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

* రెనో స్కాలా సెంటర్ కన్సోల్‌పై కప్ రెండు హోల్డర్లను గమనించవచ్చు.

* స్కాలా సెడాన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను కలిగి ఉండటమే కాకుండా, వెనుక సీట్లలోని ప్యాసింజర్లకు సైతం ఏసి ప్రసరించేలా డ్రైవర్, ప్యాసిజర్ సీట్లకు మధ్య భాగంలో ఏసి వెంట్స్‌ ఉంటాయి.

* సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రెనో స్కాలా సీట్లను నాణ్యమైన ప్రీమియం లెథర్‌తో తయారు చేశారు. ఇది కారు ఇంటీయర్‌కు ప్రీమియం లుక్‌నిస్తుంది.

* స్కాలాలో డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ల సేఫ్టీ కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఇంకా ఇందులో ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), యాంటీ-పించ్ పవర్ విండోస్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాంటి వంటి విశిష్టమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.


ఇంజన్ అండ్ ట్రాన్సిమిషన్:
రెనో స్కాలా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ స్కాలాలో రెనో నుంచి అత్యంత పాపులర్ అయిల్ 1.5 లీటర్ కె9కె డిసిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 86 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 21.64 కి.మీ. మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం).

ఇకపోతే రెనో స్కాలా పెట్రోల్ వెర్షన్‌లో పవర్‌ఫుల్ 1.5 లీటర్ ఎక్స్‌హెచ్2 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 99 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం). ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ఫీచర్స్ అండ్ ఎక్విప్‌మెంట్:
ఫీచర్ల విషయంలో రెనో స్కాలా ఓ ప్రీమియం లగ్జరీ కారును తలపిస్తుంది. ఇందులో ప్రీమియం లెథర్ సీట్లు, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, మల్టీఫంక్షనల్ స్మార్ట్ కీ, యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్) వంటి ఫీచర్లను గమనించవచ్చు.

స్కాలా ఎక్స్టీరియర్లను గమనిస్తే.. క్రోమ్ రేడియేటర్ గ్రిల్, స్మోక్ స్టయిల్డ్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్, రియర్ క్రోమ్ గార్నిష్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో ఇది మంచి ప్రీమియం లుక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కంఫర్ట్, ఇంటీరియర్ స్పేస్ విషయాల్లో ఇది నిస్సాన్ సన్నీ మాదిరిగానే మెరుగైన రియర్ లెగ్‌రూమ్, బూట్ స్పేస్‌లను కలిగి ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు:
రెనో స్కాలాలో డ్రైవర్, ప్యాసింజర్ కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), యాంటీ-పించ్ పవర్ విండోస్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాంటి వంటి విశిష్టమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

రెనో కంప్లీట్ కేర్:
స్కాలా సెడాన్, వినియోగదారుల సంతృప్తి కోసం ప్రపంచ వ్యాప్తంగా రెనో పాటిస్తున్న 'రెనో కంప్లీట్ కేర్' సర్వీస్‌తో లభిస్తుంది. ఇది 4 ఏళ్లు (2+2) లేదా 80,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. అంతేకాకుండా 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో పాటు ప్రతి 2,000, 10,000 మరియు 20,000 కి.మీ. లేబర్ ఫ్రీ సర్వీస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఫ్రాన్స్‌లోని రెనో ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన కోటెక్ టెక్నీషియన్ల ద్వారా రెనో కార్లకు సర్వీస్ సేవలను అందిస్తుంది.

రెనో స్కాలా ధరలు:
* రెనో స్కాలా పెట్రోల్ ఆర్ఎక్స్ఈ - రూ. 6.99 లక్షలు
* రెనో స్కాలా పెట్రోల్ ఆర్ఎక్స్ఎల్ - రూ. 7.85 లక్షలు
* రెనో స్కాలా డీజిల్ ఆర్ఎక్స్ఎల్ - రూ. 8.69 లక్షలు
* రెనో స్కాలా డీజిల్ ఆర్ఎక్స్‌జెడ్ - రూ. 9.57 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

రెనో స్కాలా సెడాన్ ఈ సెగ్మెంట్లోని స్కొడా ర్యాపిడ్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నాలకు పోటీగా నిలువనుంది. ఇది ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (పెరల్ వైట్, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్) లభిస్తుంది.

Story first published: Friday, September 7, 2012, 15:28 [IST]
English summary
The Renault SCALA is an elegant and dynamic sedan made for India. It is just the right car with which Renault India can reinforce its presence in the A3 segment. The SCALA will be an exceptional quality product in its segment with an attractive price point. It is equipped with features that impart status, comfort and safety.
Please Wait while comments are loading...

Latest Photos