ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ రీనాల్ట్ ఇండియా ఇటీవల జనవరిలో జరిగిన 11వ ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2012లో తమ మిడ్-సైజ్ క్రాసోవర్ 'డస్టర్'ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ ఎస్‌యూవీ ఈ ఏడాది మధ్య భాగంలో అంటే జూన్ నాటికి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది. అయితే, విడుదల కన్నా ముందే కంపెనీ డీలర్లు డస్టర్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను తీసుకుంటున్నట్లు సమాచారం. మా డ్రైవ్ స్పార్ ప్రతినిధి ఒకరు రీనాల్ట్ షోరూమ్‌ను సందర్శించగా ఈ విషయం వెల్లడైంది.
డస్టర్ ఎస్‌యూవీను సెడాన్‌లోని సౌకర్యాన్ని అటు ఎస్‌యూవీలోని పెర్ఫామెన్స్‌ను కలగలిపి రూపొందించారు. ఇదే సెగ్మెంట్లో టాటా మోటార్స్ అందిస్తున్న క్రాసోవర్ ఎస్‌యూవీ టాటా ఆరియాకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలోనూ లభ్యం కానుంది. ప్రీమియం ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్, శక్తివంతమైన పెర్ఫామెన్స్, అధిక మైలేజ్ వంటి విశిష్టమైన ఫీచర్లతో రీనాల్ట్ డస్టర్ లభిస్తుంది. దీని ధర రూ.10 లక్షలకు దిగువన ఉండొచ్చని అంచనా. బుకింగ్స్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని రీనాల్ట్ డీలర్‌ను సంప్రదించండి.
రీనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని చిత్రాల (ఫోటోలు/వాల్‌పేపర్ల) కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:
రీనాల్ట్ డస్టర్ క్రాసోవర్ ఎస్‌యూవీలో ఉండే కీలక ఫీచర్లు:
* యూఎస్‌బి, ఆక్స్-ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన మ్యూజిక్ సిస్టమ్
* నాలుగు స్పీకర్లు, శాటిలైట్ ఆడియో
* ఫోన్ కంట్రోల్
* కీలెస్ ఎంట్రీ
* రియర్ డిఫాగ్గర్
* రియర్ వైపర్, వాషర్
* ఎలక్ట్రిక్ మిర్రర్స్
* రియర్ పార్కింగ్ సెన్సార్స్
* ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
* డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్
* బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్
* ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)
డస్టర్ ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ముందువైపు ఉన్న సరికొత్త క్రోమ్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా ఇందులో 16 ఇంచ్ వీల్స్, లెథర్ సీటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 1.6 లీటర్ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజన్ (105 బిహెచ్‌పిల శక్తి), 1.5 లీటర్ డిసిఐ డీజిల్ ఇంజన్ (85 బిహెచ్‌పిల శక్తి) ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ డస్టర్ 13 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ డస్టర్ 19 కి.మీ. మైలేజీని ఇవ్వనుంది. ప్రస్తుతం రీనాల్ట్ ఇండియా దేశీయ మార్కెట్లో ఫ్లూయెన్స్ సెడాన్, కొలియోస్ ఎస్‌యూవీ, పల్స్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లను అందిస్తోంది.